ఈ పుటను అచ్చుదిద్దలేదు
చైత్రబహుళ త్రయోదశి
వరాహజయన్తీ
వరాహవతారము విష్ణుమూర్తి పది అవతారాల్లో మూడోది. ఈ అవతారము శ్రీరామావతాతం జరిగిన చైత్రశుద్ధ నవమినాడే అని కొందరు అన్నారు. కాని వివాదగ్రస్త విషయంగా ఉంది. వరాహావతారం చైత్రబహుళ త్రయోదశిని జరిగిందని తెలుగు పంచాంగాలు చెబుతున్నాయి. కాగా ఆనాడే వరాహ జయంతి జరపవలసి ఉంది.
ఈ అవతారంలో విష్ణుమూర్తి లోక కంటకుడైన హిరణ్యక్షుని తెగటార్చాడు. ఆ కధ:
హిరాణ్యాక్షుడ్ అనె రాక్షసుడు బలగర్వితుడై భూమిని చప చుట్టగ చుట్తి పట్ట్లుకుని పోయి పాతాళలోకంలో దాగుకొన్నాడు. అప్పుడు భూదేవి తన భాధలు విష్ణుమూర్తితో చెప్పుకొన్నది. ఆమొఱవిని విష్ణువు ఒక పెద్ద పంది రూపాన్ని ధరించి వెలశాడు. దాని శరీరం నల్లని పర్వతం లాగున ఉంది. దానికోఱలు త్గెల్లగా వాడిగా ఉన్నాయి. దాని గింజలు ఇనపదిమ్మెలుగా ఉన్నాయి. దాని కన్నులు పెద్దజ్యోతుల లాగున ఉన్నాయి. అది ఘర్షిరిస్తే ఉఱుము ఉఱిమినట్లు ఉంది.
ఇట్టి రూపంలో ఆపంది వచ్చి హిరణ్యాక్షుణ్ణి ఎదుర్కొన్నది. ఇద్దరికీ పెద్ద యుద్దం జరిగింది. ఆ యుధ్దంలో హిరణ్యాక్షుడు చనిపోయాడు. అప్పుడు ఆవరాహమూర్తి పాతాళంలో పడి ఉన్న భూమిని తన బలిష్టమైన కోఱలతో పైకి ఎత్తి యధాస్థానంలో ఉంచాడు. తన్నుద్దరించిన వరాహమూర్తికి భూదేవి నమస్కరించి స్తుతించింది.
కల్పాంతరమందు ఒకసారి సమస్తమూ జలమయమై పోయింది. బ్రహ్మాండమంతా చీకట్లు కమ్ముకొన్నాయి. విష్ణుమూర్తి ఆ జాలర్ణవంలో వటపత్రశాయి అయి యోగనిద్రలో ఉండి పోయాడు. నిత్యులైన మహార్లోక నివాసులు కొందఱు అప్పుడు ప్రస్తుతింపగా అతడు మేలుకొన్నాడు. తిరిగి జగత్సృష్టికీ పూనుకున్నాడు. మరల రకాశింపచేసే ఉద్దేశంతో బ్రహ్మాండాన్ని ఊర్ద్వాధోముఖములు అయ్యేటట్లు రెండుగా చేశాడు. వానిని పధ్నాలుగులోకాలుగా చేశాడు.
అధోభాగాండ చిద్రం నుండి యుల్బము భూమి మీద పడింది. అది మేరు పర్వతమైంది. పిదప నానావిధములైన పర్వతము. చెట్లు, చేమల,