ఈ పుటను అచ్చుదిద్దలేదు
మనువుకి అందుమీద ఆశ్చర్యం వేసింది. ఓమత్స్యమా! లీలలు లోగడ చూచి ఉండనివిగా ఉన్నాయి. కనీసం విని అయినా ఉండనివి ఉన్నాయి. నీవునిజానికి వాసుదేవుడవో, కాకపోతే అసురుడవో అయిఉండాలి. అని అన్నాడు.
అప్పుడు చేప 'ఓ వ్జివస్వతా! నీవు నన్ను గుర్తించావు. కాబట్టి నీకు ఒక సంగతి చెబుతున్నాను. ఇదిగో ఈనావనుచూడు. ప్రళయకాలము సమీపించింది. ఇప్పుడు చాక్షుషమన్వంతరము నడుస్తూ ఉంది. ఆ మన్వంతరము నూరెండ్లలో ముగుస్తుంది. ఆ ముగింపుకు ముందు అనావృష్టిదోషం కలుగుతుంది. ఆ కారణంగా కఱవు ఏర్పడుతుంది. ఆ పిమ్మట సంవర్తము, భీమవాదము, ద్రోణంఊ, ఇంద్రము, వలాహకము, విద్యుత్పతాకము, శోణము అనే ఏడు మేఘాలు విజృంభించి అధిక వృష్టిని కలిగిస్తాయి. ఆ వానకు సప్తసముద్రాలు ఏకమై జలప్రళయం కలుగుతుంది. భూమి వసపర్వత సహితంగా జలార్ణవంలో మునిగి పోతుంది. కాబట్టి ముందుగానే వేదములు, విద్యలు, బీజములు, మున్నగునవి - నేను, బ్రహ్మ, దేవతలు మున్నగువారు నీచే రక్షితులు కావాలి. ఆజల ప్రళయంలో అనంతుడనే పాము నీటి మీద తేలుగూ ఉంటుంది. ఆ పామును తాడుగాచేసి ఈ నావను నాకుమ్ముకు కట్టివేయి. అప్పుడు ప్రళయమారుతం వీచి ఈ ఓడను కదిపి వేస్తుంది. ఆ అల్లకల్లోలానికి నీవు ఏమీ భయపడవద్దు. ఇట్లు చెప్పి ఆ చేప అంతర్ధానమైంది.
ప్రళయకాలంలో మనువు ఆ చేప చెప్పినట్లే చేశాడు. మత్స్యమూర్తి అయి ఆనాడు ఇట్లు వేదాలు తెచ్చి వేధకు ఇచ్చి లోకాన్ని కాపాడినాడు. కావున ఆనాదు మత్స్యమూర్తి ప్రతిమను చేసి పూజించాలి.
క్రైస్తవులలో మత్స్యం శాంతి దేవతగా, మహమ్మదీయులలో చేప భగవానుడుగా పేర్కొనబడడం గమనింపవలసిన విషయం.. భౌద్దజాతక కధలలో బుద్ధుడు చేపగా పుడతాడు.
చైత్రబహరిళ ఏకాదశి
ఆమాదేర్ జ్యోతిషీ లో చైత్ర బహుళ ఏకాదశి వరూధివ్యేకాదశిగా చెప్పబడింది. దీనినే మన పంచాంగకర్తలు వరూధిని వ్రతమని ఆంటాదు. ఈ ఏకాదశినాడు ఉపవాసాదులు ఉండి వ్రతము చేసిన వారికి వేయిగోదానములు చేసిన ఫలము కలుగుతుందని చెప్పబడుతూ ఉంది. చైత్రకృష్ణ ఏకాదసి శ్రీ వల్లభాచార్య జన్మదినము.