ఈ పుటను అచ్చుదిద్దలేదు
ఉన్నాయి శ్రవణం కీర్తనం మొదలల్యినవి. ఈతొమ్మిది విధాలైన పూజలలోనూ ఏడోది దాస్యపూజ, ఈ విధమైన పూజకు హనుమంతుడు మంచి ఉదారహరణము.
భగవద్దాసులలో సాటిలేనివాడైన ఆంజనేయుని పూజకు ఉద్దిష్టమైన పర్వదినము చైత్రపూర్ణిమ.
ఈనాడు సర్వదేవతలను దమనము చేత పూజించజలని స్మృతికౌస్తుభము చెబుతూ ఉంది. అందులో శివిడికి పూజివిశేషమైనది. ఈనాడు చేసిన న్నానదానాలు మామూలు రోజుల్లో చేసే స్నానదానాల కంటే పదిరెట్లు ఎక్కువ ఫలాన్ని ఇచ్చేవిగా ఉంటాయి.
కాశ్మీరదేశంలో ఈనాడు వికుంభపూజ చేస్తారు. వికుంభుదు ఒక రాక్షసుడనీ, అతడు చాలా ఉపద్రవం కలగచేస్తాడని చెబుతారు. కాశ్మీరదేశంలో ఈనాడు 'ఇరామంజరీ ' పూజ కూడా చేస్తారు. ఇరామంజరి ఒక స్త్రీదేవత కావచ్చును. ఈనాడు పాశుపతవ్రతం చేస్తారని చ్తుర్వర్గచింతమణి.
చైత్రపూర్ణిమనాడు వరాహపురాణాన్ని దానమిస్తే విష్ణులోక ప్రాప్తి. ఈనాడు పశువతవ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి
చైత్రబహుళ పాడ్యమి
ప్రపాదాపం-ధర్మఘటాదిదానం.
ఈనాడు పాతాళవ్రతం ప్రారంభిస్తారని చతుర్వర్గ చింతామణి జ్ఞానావాప్తివ్రతం కూడా చేస్తారని తెలుస్తూ ఉంది.
చైత్రబహుళపంచమి
మత్స్య జయంతి
విష్ణుమూర్తి దశావతారాల్లోనూ మత్స్యావతారము మొదటిది. మత్స్యజయంతి దినం కొంత వివదగ్రస్తమైఉంది.
ధర్మ సింధువులో చైత్రశుక్లప్రతిపన్మత్స్య జయంతీత్యేకే ' అని ఉంది. దీనిని బట్టి మత్స్య జయంతి చైత్రశుద్ధ పాడ్యమినాడు చేయాలని కొందఱి అభిప్రాయమని సూచితమగుచున్నది. స్మృతి కౌస్తుభంలో కూడా ఈ తిధేమత్స్య జయంతిగా చెప్పబడింది.
చైత్రశుద్ధ తదియనాడు అత్స్య జయంతి దినమని