ఈ పుటను అచ్చుదిద్దలేదు

నేర్చిన ఆదర్శ విద్యార్ధి. సంస్కృతాద్యనేక భాషలు, వ్యాకరణద్యనేక శాస్త్రాలు, సంగీతాద్యనేక కళలు అభ్యసించిన ప్రోడ. ఒక కల్పం (అనగా నాలుగ్ఫు వందల ముప్పయిరెండు మిలియన్ల సంవత్సరాలు) జీవించే ఎనమండుగురు చిరంజీవుల్లోనూ అతడు ఒకడు. నారదుడు, భీష్ముడు మున్నగువారి వలె బ్రహ్మచర్యవ్రతానికి అతడు పేరుబడ్డాడు.

  ఆట్టి మహనీయుని జయంతిదినం చైత్రపూర్ణిమ.
                          వివాద గ్రస్తము
   ధర్మసింధు, నిర్ణయసింధు మున్నగు గ్రందాలలో హనుమజ్జయంతిని గురించిన విశేషాలు అంతగా లేవు.  ఈ జయంతి ఏరోజున ఛేయాలి అన్నది కొంత వివాద గ్రస్తమై ఉన్నది.
    కార్తిక కృష్ణ చతుర్దశి స్వాతి నక్షత్రం భౌమవారం మేషలగ్నంలో హనుమంతుడు పుట్టినట్లు కలదు.  మేషలగ్నం కార్తిక మాసంలో రాత్రివస్తుంది.  కాబట్టి బహుమంతుడు రాత్రి పుట్టాడని అనుకోవాలి.  మరునాడు అమావాస్యనాడు సూర్యగ్రహణం. హనుమంతుడు ఫలబ్రాంతిలో సూర్యుణ్ణి మింగబోయేసర్కి రాహువు కూడా వచ్చి ఉన్నాడు.  కాబట్టి ఈ పండుగ కార్తికమాసంలో చేయాలి.  కాని పుర్రాణాలు, పంచాంగాలు చైత్రపూర్ణీమనాడు ఈ వ్రతం చేయవలసిందిగా చెబుతున్నాయి.
                        ఉత్తరాదిని
        ఉత్తరహిందూస్థానంలో ఈ పండుగ ఆచరించబడే తీరును వ్రతొత్సవ చంద్రిక ఇట్లా చెబుతూ ఉంది.
       "చైత్రపూర్ణీమనాడు సూర్యోదయం కావడంతోటే హనుమద్దేవాలయానికి వెళతారు.  లేదా ఇంట్లో హనుమంతుని విగ్రహం పెట్టుకొని పూజ చేస్తారు.  వీరబ్రహ్మచారి, దాసబ్రహ్మచారి అనే రెండు రకాల హనుమంత విగ్రహాలు.  క్రింద చండీ విగ్రహం గల హనుమంతుడు వీరబ్రహ్మచారి.  ఈ హనుమంతుని ప్రసాదాన్ని స్త్రీలు పుచ్చుకోరు. దాసహనుమంతుని అంతాపూజిస్తారు.  ఈ విధమైన దక్షిణదేశంలో ప్రతి ఊళ్లోను, అక్కడక్కడ అడవుల్లోనూ ఉంటాయి. బొంబాయి, ప్రాంతాల్లో హిందువులే కాకుండా పార్శీలు కూడా అంజనేయాలయంలో ఈనాడు సింధూరం, నూని యిస్తారు.  ఆంజనేయులకు సింధూరం అర్పించే ఆచారంలోని అంతరార్ధం ఏమో తెలియదు.