ఈ పుటను అచ్చుదిద్దలేదు
శివుని వీర్యాన్ని ఆమెకు ఇచ్చాడు. అందుతో ఆమె గర్భం ధరించి కుమారుని ప్రసవించింది. అతడే ఆంజనేయుడు. వాయుప్రసాదికావడం చేత అతనికి వాయుపుత్రుడు అని పేరు వచ్చింది.
ఆంజనేయుని బాల్యం
పుట్టిన వెంటనె ఆ బాలుడు ఆకలికి తాళలేక ఉదయించుచున్న సూర్యుణ్ణి పండు అనుకొని పట్టి మ్రింగబోయాడు. అ సమయంలోనే అక్క్జదికి రాహువు కూడా వచ్చి ఉండెను. రాహువు ఆంజనేయుని బెదిరించాడు. అందుమీద ఆ వానరబాలుడు రాహువునే మ్రింగపోయాడు.. రాహువు భయపడి ఇంద్రునితో చప్పుకున్నాడు. ఇంద్రుడు ఐరావతము నెక్కివచ్చాడు. ఆంజనేయుడు ఐరావతము మీదకు ఉరికాడు. అప్పుడు ఇంద్రుడు అ బాలుని వజ్రాయుధంతో కొట్టాడు. హనువులకు దెబ్బతగిలి అతడు మూర్చపోయాడు. హనువులు కొట్టబడడంచేత ఆంజనేయునికి హనుమంతుడనే పేరున్నూ వచ్చింది. తనపుత్రుని పాటు చూచి వాయువు ఇంద్రునిమీద కోపగించి లోకసంచారం మానుకున్నాడు. వాయుసంచారం లేక లోకం తల్లడిల్లింది. ఆ విషయం దేవతలు బ్రహ్మతో చెప్పుకున్నార్. అప్పుడు బ్రహ్మ ఇతర దేవతలతో కూడి వచ్చి వాయువును స్తుతించి ఆంజనేయునికి చిరంజీవత్వం మున్నకు అనేక వరాలు ఇచ్చారు.
హనుమంతుని పుట్టుకనుగురించి మనదేశపు గాధయిది. మహారాష్ట్ర దేశంలో వాడుకలో ఉన్న కధ మనకు కొంత వింతగా ఉంటుంది. వింతకధ
దశరధుడు పుత్రకామేష్టి యజ్ఞాన్ని చేశాడు. ఆ సందర్భంలో యజ్ఞ కుండంలో నుంచి యజ్ఞనారాయణ సొడసూపి ఋష్యశృంగుడికి బియ్యము, పాలు, పంచదారతో చేయబడిన పాయసాన్నిప్రసాదంగా ఇచ్చి మూడు ముద్దలుగా చేసి దశరధుడు ముగ్గురు భార్యలకు పంచి ఈయమన్నాడు.
అప్పుడు దశరధుని పురోహితుడు ఈప్రసాదాన్ని మూడు ముద్దలు చేసి క్రమంగా కౌసల్య, సుమిత్ర, కైకేయులకు ఇచ్చాడు. తాను దశరధునకు ముద్దుల భార్యాఐనప్పటికీ తనకు వసిష్టుడు ముందు ప్రసాదాన్ని ఈయనందుకు కైకేయి కోపించి మూతిముడుకు కొ0ని ముద్దను చేతులో పెట్టుకుని ఆలోచిస్రూ పరధ్యానంగా నిలబడింది.