ఈ పుటను అచ్చుదిద్దలేదు

బ్రాహ్మణులకు ఒక పున్నమ అత్యంత గణనీయమైంది. యతులకు ఒక పున్నమ వరణీయమైంది. రాగల వసంత కాలానికి స్వాగతోపచారాలు చేయడానికి ఒక పున్నమి ప్రత్యేకింప బడినది.

                      పన్నెండు పున్నమ్ల కధలు
   ఒక ఏడాదిలో పన్నెండు పున్నములు పన్నెండు పర్వాలుగా ఉంటున్నవి.
చైత్ర పూర్ణీమ                     -హనుమజయంతి

వైశాఖ పూర్ణీమ -కూర్మజయంతి

జ్యేష్ఠ పూర్ణీమ --ఏరువాక పున్నమి

ఆషాడ పూర్ణిమ -వ్యాస పూర్ణిమ

శ్రావణ పూర్ణిమ -రక్షా పూర్ణిమ

భాద్రపద పూర్ణిమ -ఉపాకర్మ పూర్ణీమ

ఆశ్వీయుజ పూర్ణిమ -కోజాగరీ పూర్ణిమ

కార్తిక పూర్ణిమ -త్రిపురి పూర్ణిమ

మార్గశిగ పూర్ణిమ -కోరల పున్నమి

పుష్య పూర్ణిమ -ఉత్సర్జనోత్సవ పూర్ణిమ

మాఘ పూర్ణిమ -మహామాఘీ

ఫాల్గుణ పూర్ణిమ -కాముని పున్నమి

    ఇందులో ఒక్కొక్క పున్నమి పండుగ హిందూ దేశంలోని ఒక్కొక్క ప్రాంతంలో ఎక్కువ వాడుకలో ఉంటున్నాయి
                      'చైత్ర పూర్ణిమ '
      ఇరవైయేడు నక్షత్రాలలోను  చిత్ర ఒకటి.  అది ముత్యం లాగున ఒక్కటే నక్షత్రం.  మంచి ప్రకాశంగా ఉంటుంది.  అట్టి చిత్రా నక్షత్రంతో కూడిన పున్నమకు 'చైత్రీ ' అని పేరు.  ఈనాడు మధురకవి ఆళారు తిరునక్షత్రం.  ఏ మాసంలో చైత్ర పూర్ణిమ వచ్చునో ఆమాసం చైత్రమాసమని పిలవబదుతుంది.
                              మహాచైత్ర
     చైత్రమాసంలో సూర్యుని ప్రకాశం ప్రబలం కావడానికి ప్రారంభమవుతుంది.  ప్రబలమైన సూర్యప్రకాశాన్ని అందుకుని అంద్రుడు