ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సరస్వతిని ప్రేమింప దొడగెను. బ్రహ్మతన తప్పుతాను తెలిసికొనెను. తాను జన్మాంతరం పొంది సరస్వతిని చేపట్టెను. తన్నిట్లు చేసిన మన్మధుడు భస్మమై శరీరము లేనివాడుగా అయ్యేటట్లు బ్రహ్మ శపించాడు.
మన్మధుడు విష్ణుమూర్తి కుమారుడు. తన దేహస్వేదము వలన పుట్టిన రతీదేవిని దక్షుడు అతనికి భార్యగా ఇచ్చాడు.
శివుడు వివాహము మాని తపము చేసుకుంటూ ఉండెను. శివుడికి పుట్టిన కుమారుడు కాని తారకాసురుని సంహరింపలేడని తేలింది. శివుడు పార్వతిని చేకొనేటట్లు ఛెయడానికి మన్మధుడు ఇంద్రుని సంప్రార్ధనమున పూనుకున్నాడు. శివుని మీద పూల బాణాలు వేశాడు. శివుని మనస్సు చలించింది. తన మనస్సు ఇట్లా చలింప చేసిన దురాత్ముడు ఎవ్వడా అని శివుడు తన మూడవ కన్ను తెరిచి చూచాడు. మన్మధుడు భస్మమై అనంగుడయ్యాడు.
రతీదేవి విలపించింది. మన్మధుడు ఆమెకు మాత్రం కనిపించేటట్లు వరం ఇచ్చేడు. రతీ మన్మధులు అన్యోనానురాగం బాగా ఉన్న దంపతులు. అందుచేత ఈ రోజున మదనుని పూజిస్తే దంపతులకు అన్యోన్యానురాగం పెంపొందుతుంది.
దీనిని మన పంచాంగంలో అనంగత్రయోదశి అంటారు. మదన త్రయోదశి, కామదేవ త్రయోదశి, అని నామాంతరాలు. ఈ పర్వానికి చతుర్వర్గ చింతామణి మదనపూజ, మదన మహోత్సవము అనే నామాలు వాడించి. తిధితత్వము దుమనాత్మక మదనపూజ అంటూ ఉంది. దీని వల్ల దమనముతో ఈనాడు మన్మధుని పూజించాలని తేలుతూ ఉంది.
ఈనాటి వివరణలో పంచాంగ కర్తలు దమనేనశివపూజ అని వ్రాస్తారు. అనగా ఈదినమున దమనములచేత శివుణ్ణీ పూజించాలి అని. ఈనాటి శివపూజ మిక్కిలి ఫలప్రదమైనది. ఈ ఒక్కనాటి పూజ వలన సంవత్సరం పూజించిన ఫలం కలుగుతుంది. ఈనాడు దమనముతో ఈశ్వరపూజ చేయాలని స్కృతి కౌస్తుభము.
చైత్ర శుద్ధ చతుర్ధశి
1) శైవ చతుర్ధశి
2) కర్ధమ క్రీడ
3) రౌచ్యమన్వాది.