ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ద్వాదశినాటి ఉదయం దేవతలు తిరిగి పాలసముద్రమును మధింపగా మంగళకరురాలైన లక్ష్మీదేవి నాలుగు చేతులతో రెండు చేతులతో, బంగారు పద్మాలను, మిగతా రెండు చేతులతో ఒక సువర్ణపాత్రాన్ని, మాదీఫలాన్ని పట్టుకుని పుట్టువు నొందింది. అ పిమ్మట చంద్రుడు పుట్టాడు. లోకమాత అయిన లక్ష్మికి అతడు తోబుట్టువు అవడం చేత లోకమారులుడనే ప్రసిద్ధిని పొందాడు. తరువాత లోకపావని అయిన తులసి జన్మించి విష్ణుపదపూజర్హ అయింది. అప్పుడు దేవతలు ప్రార్ధన మీద విష్ణువు లక్ష్మెని చేకొనెను. లక్ష్మీనారాయణులకు ఆసమయమున అమృతసంభవ అగు తులసి దళాలతో పూజలు చేసి అమృతమయములైన నైవేద్యాలు ఆరగింపుచేశారు.
ఆసందర్బంలో నారాయణుడు దేవతలతొ ఇట్లా అన్నాడు. "ద్వాదశినాడు లక్ష్మీ సహితుడనైన నన్ను తులసీదళాలతొ విశేషంగా పూజించారు కాబట్టి ద్వాదశి తిధి నాకు మిక్కిలి ప్రియతమమైందిగా ఉంటుంది. ఇది మొదలు ఏజనులు ఏకాదశిని ఉపవాసం ఉండి ద్వాదశినాటి ప్రాత:కాలాన శ్రద్ధాభక్తులతో లక్ష్మీసహితుడయిన నన్ను తులసిచే పూజిస్తారో వారు స్వర్గలోకాన్ని పొందుతారు. ద్వాదశి ధర్మార్ధకామమోక్షాలను నాలుగింటిని ఇచ్చేది.?
పద్మపురాణ వచనం ఇట్లా ఉంది. దీనిని హరివాసరమని గొప్పగా చెబుతారు.
చైత్రశుద్ధ త్రయోదశి
సత్యవ్రత తీర్ధానం పుణ్యదినం. మాధ్వ పుణ్యతీర్ధదినం. దీనిని అనంగ త్రయోదశి అంటారు. మదన త్రయోదశి అనిన్నీ అంటారు. అనంగుడన్నా, మదనుడన్నా మన్మధుడు అని అర్ధం. కాగా ఇది మన్మధునికి సంబంధించిన పర్వం. మన్మధుడు బ్రహ్మచేత, శివునిచేత అనంగుడుగా చేయబడినట్లు పురాణాలు రెండు కధలు చెబుతున్నాయి. మన్మధుడు సౌందర్యరాశి. మన్మధుని వాహనం చిలుక. అరవిందాది పుష్పములు అతని బాణములు. అతడు ప్రేమధిదేవత. సృష్త్యాదిని బ్రహ్మహృదయం నుండి మన్మధుడు అతని వామభాగం నుండి రతీదేవి పుట్టారు.
మన్మధుడు తన బాణాలను మొదట బ్రహ్మమీదనే ప్రయోగించాడు. అందుతో బ్రహ్మ వికాతచిత్తుడై తాను సృష్టించుటచే తన కూతురైన