ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10. శ్రావణ బహుళ ఏకాదశి -అజైకాదశి

11. భాద్రపద శుక్లఏకాదశి -వామనైకాదశి

12. భాద్రపద బహుళ ఏకాదశి -ఇందిరైకాదశి

13. ఆశ్వీయుజ బహుళ ఏకాదశి -పాశాంకుశైకాదశి

14. ఆశ్వీయుజ బహుళ ఏకాదశి -రమైకాదశి

15. కార్తీక శుక్ల ఏకాదశి -ప్రబోధన్త్యకాదశి

16. కార్తీక బహుళ ఏకాదశి -ఉత్పత్త్యైకాదశి

17. మార్గశిర శుక్ల ఏకాదశి -మోద్చదైకాదశి

18. మార్గశిర బహుళ ఏకాదశి -సఫలైకాదశి

19. పుష్య శుద్ధ ఏకాదశి -పుత్రదైకాదశి

20. పుష్య బహుళ ఏకాదశి -షట్ తిలైకాదశి

21. మఘ శుద్ధ ఏకాదశి -జయైకాదశి

22. మాఘ బహుళ ఏకాదశి -విజయైకదశి

23. ఫాల్గుణ శుద్ద ఏకాదశి -అమలక్యేకాదశి

24. ఫాల్గుణ బహుళ ఏకాదశి -పాపమోచిన్యేకదశి

25. అధిక మాసపు శుద్ధ పక్ష ఏకాదశి -శుభద్ర

26. బహుళ పక్ష ఏకాదశి -కమల

   ఈ ఏకాదశులలో కొని ప్రత్యేక కారణాల చేత ప్రత్యేక మగు కొత్త పేళ్లను కూర్చుకున్నాయి.  ఆషాడశుద్ధ ఏకాదశి బోధనైకాదశి.  మాఘ శుద్ధ ఏకాదశి భీష్మఏకాదశి.  కార్తికశుక్ల ఏకాదశి బోధ్యనైకాదశి. మాఘ శుద్ధఏకాదశి భీష్మ ఏకాదశి. తెలుగుదేశంలో వాడపల్లి ఏకాదశి, కోరుకొండ ఏకాదశి, అంతర్వేది ఏకాదశి అనేవిశేషమైన ఏకాదశులున్నూ ఉన్నాయి.  ఆయా ఏకాదశుల వివరణ సందర్భాన వీనిని గురించి వివరాలు తెలుసుకొందాము.
                                        కామదైకాదశి
      సంవత్సరంలోని ఇరవైనాలుగు లేద ఇరవై ఆరు ఏకాదశులు ఇరవై నాలుగు లేదా ఇరవై ఆరు పర్వాలై ఉన్నాయి అని తెలుసుకొని ఉన్నాము.  మన ప్రస్తుత పరిశీలనాన్ని అందుతూ ఉన్నచైత్రశుద్ధ ఏకాదశి కామదైకాదశి అనే పర్వమై ఉన్నది.  ఇరవై  నాలుగు లేదా ఇరవై ఆరు ఏకాదశుల్లోనూ చైత్రశుద్ధ ఏకాదశి మొదటిది.  కాదైకాదశిఅనగా కోరిన కోరిక ఇచ్చే