మధింప ప్రారంభించిరి. మిక్కిలి నియమముతో వారు ఏకాదశిని ఉపవసించి యుండిరి. మొదట హాలాహలము, తరువాత జ్యేష్ఠాదేవి పుట్టాయి. మరునాడు అనగా ద్వాదశినాడు లక్ష్మీదేవి పుట్టింది. అప్పుడు విష్ణువు లక్ష్మీదేవిని చేకొంటూ ఇట్లా చెప్పాడు. ఓ దేవతలారా! మీరు లక్ష్మీ సందర్శనాన్ని కోరి ఏకాదశిని ఉపసించారు. ఏకాదశి సకలోద్రవ నాశకమైనది. ఏకాదశిలో సమానమైన వ్రతం లేదు. ఏకాదశేంద్రియాలచే చేసిన పాపాలు అన్నీ ఏకాదదశ్యుపవాసం వల్ల నశిస్తాయి. సకల వర్ణముల వారికి, ఆశ్రమస్థులకు, స్త్రీలకు ఏకాదశి వ్రతం తప్పక చేయదగ్గది. దశమితో కలసిన ఏకాదశిని వర్ణించి, పరిశ్ధమైన ఏకాదశియందు ఊఫవాసం చేయాలి. దశమి యందు ఏకభుక్తము చేసి, ఆరాత్రి కటికి నేలమీద పరుండి, మరునాడు ఏకాదశియందు ఉసిరిక పప్పును నూరి శరీరానికి పూసుకుని స్నానం చేసి ఉపవాసం ఉండి పురాణాది పఠనతత్పరుడై పగలు నిద్రింపక యారాత్రి తిరిగి కటికి నేల మీద పరుండి ద్వాదశి నాదు పూజ, భోజనం సాగించాలి."
ఇట్లు ఏకాదశి గొప్పతిధి అయి ఉంది. ఏడాదిలో వచ్చే ఇరవైనాలుగు ఏకాదశులున్నూ ఇరవై నాలుగు గొప్ప తిధులు.
చాంద్రమానపరిగణమున మూడేంళ్లకు ఒకసారి అధికమాసం వస్తూ వుంటుంది. ఆ అధిక మాసంలో రెండు ఏకాదశులు. అధిక మాసం వచ్చినప్పుడు ఏడాదికి ఇరవై ఆరు ఏకాదశులు అవుతాయి.
ఇట్లు ఇరవిఅనాలుగు, లేదా ఇరవై ఆరు ఏకాదశులు ప్రత్యక్షపర్వాలై ప్రత్యేకనామాలతో వ్యవహిరింపబడుతున్నాయి.
1. ఛైత్రశుక్ల ఏకాదశి -కామదైకాదశి.
2. చైత్ర బహుళ ఏకాదశి -వరూధిన్యేకాదశి.
3. వైశాఖ శుక్లఏకదశి -మోహిన్యేకాదశి.
4. వైశాంఅ బహుళ ఏకాదశి -అపరైకాదశి.
5. జ్యేష్ఠ శుక్ల ఏకాదశి -యోగిన్యేకాదశి
6. జ్యేష్ఠ బహుళ ఏకాదశి -యోగిన్యేకాదశి.
7. ఆషాడ శుక్ల ఏకాదశి -పద్మైకాదశి.
8. ఆషాడ బహళ ఏకాదశి -కామికైకాదశి.
9. శ్రావణ శుక్ల ఏకాదశి -పుత్రదైకాదశి.