ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అందులో వారికి దివ్యత్వం వస్తుంది. తిరిగి సూక్ష్మ శరీరాలుఇ పొంది వారు దేవలోకానికి వెళ్లిపోతారు.
ఈ పురాణగాధలో గొప్ప వేదాంతార్ధం ఇమిడి ఉంది. జీవుడికి భూలోకంలో అనేక వాసనలు అంటుకున్నాయి అనీ, అందుచేత అతను ఉత్పధగామె కాలేక పోతున్నాడనీ, ఏకాదశివ్రతం నిష్ఠగా ఆచరించడంవల్ల ఆ వాసనలను విడనాడి అతడు మోక్షపదవి పొందగలడనీ ఈ గాధ వలన సూచిత మవుతున్నది.
చాకలిది చేసిచూపిన దానితో ఏకాదశివ్రతమహాత్య్మం రుక్మాంగధరుడికి తెలిసి వస్తుంది. అప్పటి నుంచి రుక్మాంగధుడు కూడా ఏకాదశీ వ్రత నిష్ఠా గరిష్ఠుడు అవుతాడు. ఆనిష్ఠవలన అతడు ఇంద్రపదవిని అధిట్ఠింపజాలే శక్తిని సంతరించు కొంటాడు. అందుచేత ఇంద్రుడికి భయం పుట్టి అతని నిష్ఠను చెడ గొట్టమని మోహిని అనే దేవవేశ్యను పంపుతాడు.,
రుక్మాంగదుడు మోహినికి వశవర్తుడు అవుతాడు. మోహినితోడిదే లోకంగా ఉంటూ అతడు తన రాజ్యాన్ని భార్యను, కొడుకును మరిచిపోతాడు. ఇట్లు తనకు పూర్తిగా వశవర్తుడై పోయిన రాజువల్ల ఆమె ఒక వాగ్ధానాన్ని పొందుతుంది.
ఈ వాగ్దానాన్ని పురస్కరించుకొని మరుసటి ఏకాదశరోజున మోహిని ఒక పట్టు పడుతుంది. ఆనాడు ఉపవాసంమాని రాజు తనతో అన్నమేనా తినాలి లేదా కన్న కొడుకుకంఠాన్ని కత్తితో తెగవేయనేనా తెగవేయాలి అని. ఆమె మనస్సు మార్చడానికి రుక్మాంగధుడు అనేక విధాల ప్రయత్నిస్తాడు. కాని కార్యం లేక పోతుంది. ఏకాదశివ్రతం మానడానికి మాత్రం అతను ఎంత మాత్రం ఇష్ఠ పడలేదు. కన్నకొడుకును కత్తికి ఎరచేసి వేయడానికి సిద్ధపడ్డాడు. తన బార్యను కత్తి తెమ్మాన్నాడు.
కొడుకుని కాచుకుని నిలబడమన్నాడు. తెగవేయడానికి కత్తి ఎత్తాడు. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. రుక్మాంగదుని ఏకాదశి వ్రతనిష్ఠకు మెచ్చి అతనికి ఇంద్ర పదవి ఇచ్చాడు.
పద్మపురాణ ఉత్తరఖండంలో ఏకాదశీవ్రతమాహాత్మ్యము ఇట్లు చెప్పబడింది. "దేవదానవులు క్ష్రీరసాగరమున ఒక ఏకాదశీ దినమున