పండుగలు-పరమార్థములు ఆండ్ర శేషగిరిరావు అప్ప చెప్పకోరతాను" అని చెప్పాడు. అందు మీద రాజు 'నీ భార్య ఎట్లా ఉంటుంది.! ఆమెను ఏవిధంగా గుర్తించవచ్చును'. అని సుశర్మను అడిగాడు. "నాభార్య నల్లగా, పొట్టిగా ఉంటుంది. మిట్టకళ్ళు. కుఱచచేతులు, పీక్కుపోయిన ముఖం. బొంగురు గొంతుకు మాట్లాడితే పోట్టాడడానికి వచ్చినట్లుగా ఉంటుంది.” అన్నాడు సుశర్మ. అప్పుడు రాజు అతనితో “ఓవెట్టి బ్రాహ్మడా! కురూపి గయ్యాళి అయిన అట్టి భార్య పోయినదని ఎందుకు కుములుతావు! అందమైనది, అనువర్తనకలది అయిన మరి ఒక స్త్రీని పెళ్ళాడు" అన్నాడు. దానికి సమాధానంగా సుశర్మ దేవా! భార్య ఎట్లాంటిది అయినా భరింపబడ వలసింది. కురూపి అని వదిలి వేయకూడదు. భార్యలేని వానికి అనుదిన కర్మలు చెడిపోతాయి. భార్యను విడిచి పెట్టినవానికి నరకలోక ప్రాప్తి కలుగుతుంది. పైగా వాని కులం సంకరమై పోతుంది. కాబట్టి నాభార్యను వెదికి నాకు అప్పగించవలసిందిగా కోరతాను అన్నాడు. వెంటనే రాజు రథం ఎక్కి అడవులకు వెళ్లి సుశర్మ అర్ధాంగి కోసం అన్వేషణ ప్రారంభించాడు. గట్టులు, గుట్టలు, డొంకలు, డొజ్జులు వెతుక్కుంటూపోయాడు. ఎక్కడా ఆమె కనిపించలేదు. ఆమెను వెతుకుతూ రాజు త్రికాలజ్ఞుడు అనే ముని ఆశ్రమానికి వచ్చాడు. రాజు రాకను గమనించి ఆముని అతనికి అర్ఘ్యం ఈయడానికి నీరు తెమ్మని శిష్యునితో చెప్పాడు. శిష్యుడు నీరుకొనిరాక నిదానించి మరీ ఆజ్ఞాపించండి అన్నాడు. ముని నిదానించాడు. రాజు అప్పటికి భార్యాహీనుడుగా ఉన్నాడు. భార్యలేనివానికి అర్ఘ్యం పొందే అధికారం లేదు. అందుమీద త్రికాలజ్ఞుడు అర్ఘ్యం విషయం ప్రస్తావించక రాజా! నీవు వచ్చిన పని ఏమిటని ప్రశ్నించాడు. రాజు తాను వచ్చిన పనిచెప్పి సుశర్మ భార్య ఎక్కడ ఉన్నదో చెప్పమని మునిని కోరాడు. మునిదివ్యదృష్టితో చూచి 'రాజా! అద్రిసుతుడైన బలాకుడనే రాక్షసుడు సుశర్మ భార్యను ఎత్తుకుపోయాడు. ఉత్పలావతకము అనే వనములో ఉంచాడు. నీవు వెళ్లి ఆమెను విడిపించుకొని తీసుకువెళ్లి సుశర్మ వద్దకు చేర్చు' అన్నాడు. అప్పుడు ఉత్తముడు మునితో 'మహాత్మా! నాకు అర్ఘ్యం 30
పుట:PandugaluParamardhalu.djvu/32
ఈ పుటను అచ్చుదిద్దలేదు