ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంపదకోరేవాడు తిధి విషయమై జాగ్రత్త వహించాలి.

         దీర్ఘాయువును కోరేవారు వారం విషయంలో మెలుకువవహించాలి.
         పాపం నుంచి విముక్తి కోరువాడు నక్షత్ర విషయం గమనించాలి.
         రోగాలనుంది రక్షణ కోరేవారు యోగవిషయం శ్రద్ధ వపెట్టాలి.
         తాను చేసే పనులలో విజయం కోరేవారు కరణం విషయం జాగ్రత్త పడాలి.
         పంచాంగముల ప్రయోజనమిట్టిది.
        గ్రహాదుల ప్రభావం సరిగ్గా తెలుసుకొని జాగ్రత్తగా వర్తిస్తే మానవుని జీవితం సుఖాస్సదమున్నూ, జయప్రదమున్నూ అవుతుంది. గ్రహాదుల ప్రభావం సరిగ్గా తెలుసుకోవడానికి పంచాంగ పరిజ్ఞానం చాల అవసరం. తెలివైన వాళ్లు నక్షత్రాలను తమకు అనుకూలంగా నడుపుకుంటారనేనానుడి ఈ సందర్భంలో పుట్టిందే.
    అయితే పూర్వకాలంలో పంచాంగాలు ఇప్పటిలాగ అచ్చుపడి అందరికి అందుబాటులో ఉండేవికావు. అప్పుడు పంచాంగాలు తాటాకులమీదకాని, భూర్జర పత్రాలమీద కాని వ్రాసి ఉండేవి.  ఒక్కొక్క గ్రామానికి ఆ గ్రామ పురోహితుడి వద్ద మాత్రమే అపురూపంగా ఒక పంచాంగం ఉండేది.
     అ పంచాంగం ఆధారంగా పెట్టుకుని అతడు గ్రామస్తులకు పండుగలు, పబ్బములు, నోములు, వ్రతాలు చేయవలసిన రోజులు, ప్రయాణాది విషయాలలో మంచి చెడ్డలు, ముహూర్తములు మొదలయినవని చెప్పేవాడు.
     సంవత్సరాదినాడు ఊళ్లో దేవాలయంలో అతడు కొత్తపంచాంగానికి పసుపు బొట్టు పెట్టి పూజ చేసేవాడు.  అచట చేరినవారికి పంటపర్యాయాలు, వర్షయోగాలు, రాజపూజ్యావమానాలు, ఆదాయవ్యయాలు, కందాయ ఫలాలు, గ్రఃఅణ కాలాలు మొదలయినవి చెప్పేవాడు.
    దీనినే పంచాంగ శ్రఫణ మంటారు.  అబ్దఫలము తెలిసికోవడానికి ఇది అవసరము.
    విద్వాన్ కావ్యతీర్ధ శీమద్ధులపల్లి వేంకటసుబ్రహ్మ్యణ్య శాస్త్రి పంచాంగ శ్రవణ ఫలమును ఇట్లు చక్కగా వివరిస్తున్నారు.