ఈ పుటను అచ్చుదిద్దలేదు
జ్యేష్ట శుక్ల బహుళ చతుర్ధశి
మాసశివరాత్రి అని ఆమాదేర్ జ్యోతిషీ,
జ్యేష్టబహుళ అమావాస్య
శ్రద్ధసమయ విశేషమని తిధితత్వము.
, వట సావిత్రి
మఱ్ఱి చెట్టుకింద ఉన్న సావిత్రిని రాత్రి పూజించాలి. ఈ వ్రతాన్ని జ్యేష్ఠ పూర్ణిమకు చేస్తారు. లేదా జ్యేష్ఠామావాస్యనాడు చేయవచ్చు. ఈనాడు స్త్రీ ఉపవసించి జలముతో వట వృక్షాన్ని తడపాలి., ఆ చెట్టు చుట్టూ నూట ఎనిమిది సారులు దారం చుదుతూ ప్రదక్షిణం చేయాలి.
జగత్పూజ్యే గనన్నాత: సావిత్రి పదిదైవతే.
పత్యాసహావియోగం మెవటస్థే కురుతేనమ:
ఈ విధంగా ప్రార్ధించాలి. మరునాడు సువాసినీ స్త్రీలకు భోజనం పెట్టాలి. ఈ వ్రతం చేసే స్త్రీ సర్వదా సౌభాగ్యవతి అయి ఉందును. మిధునసంక్రాంతి భోగశాయి పూజచేసి ఈనాడు ఉపవాసం ఉండాలని హేమాద్రి చెప్పుచున్నాడు. ఈనాడు సుజన్మానాస్తి వ్రతం, సంక్రాంతి స్నానవ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి.