ఈ పుటను అచ్చుదిద్దలేదు
పారస్కరుడు తన గృహ్యసూత్రాలలో హలకర్మకు జ్యేష్ఠాస్వాతీ నక్షత్రాలు మంచివని చెబుతున్నాడు. జ్యేష్ఠపూర్ణిమనాడు ఓషధీపతి అగు చంద్రుడు హలకర్మకు మంచి నక్షత్రమైన జ్యేష్ఠకు దగ్గరగా ఉంటాడు.
ఏరువాకను గురించి, నాగలిని గురించిన జానపద గేయాలు ఉదాహరించి ఉన్నాను. ఏరువాక పున్నమి గురించి మన సినీమా సాహిత్యంలో కూడా ప్రత్యేకంగా ప్రస్తావన వుంది.
ఏరువాక వ్చచ్చిందిరా
దుక్కిటెద్దు రంకె వేసిదిరా
తొలకరింపు పులకరింంచిందిరా
నిండు - పూర్ణిమంబు పుష్పించెరా
నీ - భూదేవిని పూజసల్పరా -
-కొసరాజు రాఘవయ్య చౌదరి 'రైతుబిడ్డలో '
ముద్దుల యెద్దుకు - ముత్యాలసరులు
రంగుల యెద్దుకూ - రత్నాలసరులు
ముద్దుల-- -గూడవల్లి రామబ్రహ్మం 'రైతుబిడ్దలో '
ఈరోజు వ్యవసాయదారుల నమ్మకాల గురించి తెలుసుకోందాం. ఈరోజున ఎవరికీ అప్పు - బదులు యివ్వరు, డబ్బుపెట్టి ఏమి కొనరు. ఇంట్లోదేమో బయటకు పోకూడడు. కావలసిన వస్తు సామాగ్రి అంతా ముందురోజునే తెచ్చుకుంటారు. ఏరువాక సాగినవాడు నిప్పుకూడా పెట్టరు. శూద్రులు కోడీని కోసుకుంటారు. బ్రాహ్మలు కొబ్బరికాయలు కొట్టుకుంటారు. ఇంట్లో పిందివంతలు. పంచాంగంలో సున్నాలు లేనివానిచేత పాలేరయినా సరే విన్న కుర్రాడయినా సరే నాగలి పూయిస్తారు. -ముద్దా విశ్వనాధం. 'ఎద్దులు లేని సేద్యం చద్లేనిపయనం ' - 'ఒంటియెద్దు సేద్యం వరిగాలునొప్పి,' 'గొడ్లు, వడ్లు ఉన్నవాడిదే వ్యవసాయము,' 'ఎక్కువ వెల పెట్టి గుడ్దను, తక్కువ వెల పెట్టి గొడ్డును కొనకూదదు ' అనే సామెతల వల్ల ఎద్దుల ప్రాముఖ్యం వెల్లడవుతూ ఉంది. కఱ్ఱమన్ను అయితే కాపు బతుకుతాడు, దుక్కిచలవే చలవ, తల్లి పాలే పాలు దుక్కిగల భూమి దిక్కు గల మనుష్యుడూ చెడడు. అరక అరిగితే గరిసె విరుగును. దుక్కి ప్రాముఖ్యాన్ని గుర్తించారు. కాబట్టి