వెంటపడినది. ఆమెను అతడు వెళ్లి పొమ్మంటాడు. పతిని విడచి తాను పోజాలనంటూ ఆమె అతని వెంట వెళుతూ ఉంటుంది. అప్పుడు నీపతిప్రాణాలు తప్ప మిగతా ఏదైనావరం కోరుకోమంటాడు. అప్పుడు ఆమె మామకు దృష్ఠి ప్రసాదింపుమని కోరుతుంది. రెండో వరంలో ఆమె మామరాజ్యాన్ని తిరిగి పొందేటట్లు వరం అడుగుతుంది. మూడోవరంతో తన తండ్రికి నూర్గురు కొడుకులను కోరుతుంది. ఇట్లా వరాలు పొందిన్నీ ఆమెయను నినివిడున కుండా వెంటనండే ఉంటుంది. నాలుగో వరంలో తనకు సత్యవంతుని వలన నూరుగుతు కొడుకులు పుట్టేటట్లు వరం అడుగుతుంది. యముడు ఆవరాన్ని ఇస్తాదు. సత్యవంతుని పాశవిముక్తుని చేస్తాడు. అతనిని తీసుకుని, సావిత్రి భర్తకళేబరము వద్దకు వస్తుంది. ఆ కళేబరాన్ని తన తొడపై పెట్టుకుని కూర్చుంటుంది. అతడు లేచి కూర్చుంటాడు. అప్పటికే రాత్రి బాగా పొద్దుపోతుంది. వారు తొందరగ ఆశ్రమానికి వెళ్లినారు. భర్త జీవితార్ధము తాను సలిపిన వ్రతం అనేక విధాలను సుఖ ఫలితాన్ని ఇచ్చిన వైనం అచటివారికి సావిత్రి చెబుతుంది. సావిత్రి ఆవ్రతం వల్ల తన్ను, తల్లి తండ్రుల్ని, అత్తమామల్ని, భర్తను ఉద్దరిస్తుంది. లోకములోనివారు అందరూ ఆమెను మహాసాద్వి అని కొనియాడారు.
జ్యేష్థశుద్ధ పూర్ణిమనాడు సావిత్రి వ్రతం చేస్తే సౌభాగ్యం వృద్ది అవుతుంది. జ్యేష్ఠశుద్ధ త్రయోదశి మొదలు ఉపవాసము పూర్ణిమ మూడవరోజు, నాలుగవరోజు సాయంత్రం చంద్రోదయమైన తరువాత భోజనం. మూడురోజులు ఉపవాసం చేయలేనివారు పూర్ణీమతిధి ఒక్కనాడైనా ఉపవాసం చేసి సావిత్రీ వ్రతం చేయాలి. ఈ వ్రతం చేసే పుణ్యస్త్రీలకు వైధవ్యమనేది ఉండదు. నిరంతరసౌభాగ్యం కలుగుతుంది. వట సావిత్రీ వ్రతాన్ని త్రయోదశినాడు ప్రారంభించి ఈనాడు ముగిస్తారని చతుర్వర్గ చింతామణి. ఏరువాక పూర్ణిమ జ్యేష్ఠపూర్ణిమనాడు ఏరువాక సాగడం అను న్యూతంగా వస్తూ ఉంది. ఎడ్లను, నాగలిని పూజించి కర్షకుడు శుచివస్త్రదాదియై మౌనం వహించి యేరు వాక కర్మను చేయాలని కలదు. అయితే ఈ కర్మకు జ్యేష్ఠ పూర్ణిమ ఎందుకు వరణీయమైంది అనే ప్రశ్న కలగడం సహజం.