ఈ పుటను అచ్చుదిద్దలేదు

చరిత్రము వింటూ జాగరం చేయాలి. తెల్లవారినతరువాత ఆసావిత్రి ప్రతిమను దక్షిణసహితంగా దానంచేయాలి. ఇదిస్త్రీలకు సౌభాగ్యప్రమైనది.

    తిలచ్చత్రాదిదానం, బిలత్రరాత్రి, పుత్రకామ, అశోకత్రిరాత్ర మున్నగు వ్రతాలు చేస్తారని వ్రతగ్రంధాలు.
   ఆమాదేర్ జోతిషీ దీనిని స్నానపూర్ణిమ అని పేర్కొంటూ ఉందని.
   జగనాధదేవస్యస్నానం, స్నానయాత్రా, మహాజ్యెష్టి పురుషోత్తమ క్షేత్రాన జరపడం, విశిష్టఫలదంగా ఉంటుందని, ఈనాడు తిలదానం చేస్తే ఆశ్వమేధ యాగము చేసినఫలం క్జలుగుతుందని చెబుతారు.
          వట పూర్ణిమ - పట సావిత్రీ వ్రతం
  వివాహితులైన స్త్రీలు జ్యేష్థశుద్ధ పూర్ణీమ నాడు ఈ పర్వాన్ని జరుపుతారు.
      ఈ రోజున ఉపవాసం వుంటారు.  వటవృక్షపూజకు (icus Indica) ఉద్దిష్టమైనది. స్త్రీలను వైధవ్యం రాకుండా ఈ పర్వం చేస్తుందని నమ్మకం.
    ఈ వ్రతము అనాదికాలంనుంచీ వున్నట్లు కనిపిస్తుది. ధర్ముడు (ధర్మరాజు) ఒకసారి లోమశ మహర్షిని ప్రశ్నించాడు. పూర్వం  ద్రౌపది వంటి మృదుబాషిణి, సుందరాంగి, పతివ్రత ఐన స్తీ వున్నదా అని, అప్పుడు ఆ ఋషి ధ్సర్ముడికి సావిత్రి కధ చెబుతాడు.
   యముడు ఇచ్చిన నాలుగో వరంలో సావిత్రి జన్మ సావిత్రి అనీ, సౌభాగ్యవతి అనీ, మంగళ మహేశ్వరి అనీ తాను పిలవబడాలని కోరింది.  ఆవరం పొంది సావిత్రి వచ్చి తన భర్త గెడ్డం ముట్టుకుంది.  అతడు లేచి కూర్చున్నాడు.
   మాళవదేశంలో ఈ పందుగ జ్యేష్టశుక్ల త్రయోదశి మొదలు పూర్ణిమ వరకు మూడురోజులు చేస్తారు.
  ఈ మూడు రోజులు స్త్రీలు వట వృక్షానికి, సావిత్రి, సత్యవంతుడు, యముడు వీరల పటానికి పూజ చేస్తారు.  వివాహితలై సుమంగళులుగా వున్న స్త్రీలు మాత్రమే ఈవ్రతాన్ని ఆచరిస్తారు.
  కొందరు స్త్రీలు ఈ పర్వాన్ని ఒక పూర్ణిమ నాదు మాత్రమే ఆచరిస్తారు.  ఆనాడు వారు పూర్తిగా ఉపవాసం వుంటారు.  మరునాడు ఉదయాన్ని భోజనం చేస్తారు.
మూడు రోజులు ఈ పర్వాన్ని జరిఫ్ంచేవారు త్రయోదశి ఉదయం మొఏలు పౌర్ణమినాటి సాయంకాలం వరకు ఉపవసిస్తారు.