ఈ పుటను అచ్చుదిద్దలేదు
మొగలాయి చక్రవర్తుల కాలంలో జగన్నాధ పండిత రాయలు అనే సంస్కృత కవి ఒకదు ఉండెను. అతడు గోదావర్తి తీరానికి చెందిన ఆంధ్ర బ్రాహ్మణుడు. డిల్లీ మొగలాయి కొలువులో పండితకవిగా ఉంటూ అతదు ఒక మహమ్మదీయ స్త్రీని వివాహమాడాడు. కాగా సనాతనులు అతనిని సంఘ బహిష్కృతుని చేశారు అందుమీద అతడు తన యొక్క తన భార్య యొక్క పావిత్ర్యాన్ని నిరూపించుకోవడానికి కాశీ వేళ్లాడు. అచ్చటి పండితులల్టో వాదించేడు. అయినాఅతని వెలితొలగలేదు.
మీరు ఒప్పుకోకపోయినా గంగా భవాని మా పావిత్ర్యాని ప్రత్యక్షీకరిస్తుందని అతదు ఒక రేవులో గంగాస్తోత్రం చేయసాగాడు. ఆరేవుకి ఏభై రెండు చీడీలు ఉన్నాయి. పండితరాయలు ఎత్తున రెండో చీడీ మీద కూర్చుని యాభైరెండు స్తోత్ర శ్లోకాలు చెప్పడానికి ప్రారంభించాడు.
ఒక్కొక్క శ్లోకం చెప్పి ముగించే సరికి గంగానది ఒక్కొక్క మెట్టు పైకి వచ్చేది. చివరి శ్లోకంతో గంగ యాభై రెండు మెట్లకు పొంగి పండితరాయల్ని తనలోనికి తీసుకుంది. అందుతో అతని పావిత్ర్యం నిరూపితమైంది.
పండితరాయలు తెలుగువాడు. ఈ పర్వం అతని మూలకంగా ఏర్పడింది. ఉత్తర హిందూ స్థానంలో ఈ పండుగ ప్రచారంలో ఉంది.
నదులను పూజించే ఆర్యులు ఆచారాన్ని పట్టి ఆదిలో ఈ పర్వం ఏర్పడినా ఇటీవల ఇది పండితరాయల చరిత్రలో స్థానమున పూజితుడు అవుతూ ఉండడం, ఆంధ్రులకు అత్యంత ఆమోదకర విషయం.
దక్ధిణాదిని ఈ పర్వం ఈతీరును ఉన్నట్లు లేదు. ఇక్కద దశపాపహరదశమి పర్వం సదాశివ బ్రహ్మేంద్రసరస్వతి స్వామి వారి పూజకు ప్రత్యేకింపబడి ఉంది.
వైశాఖ మాసాంతాన స్వామి వెరూరు గ్రామం చేరి 'నేను జ్యేష్ఠ శుద్ధ దశమినాడు జీవితం చాలిస్తాను. ఆ రోజున కాశీ నుండి ఒక బ్రాహ్మడు ఒక లింగాన్ని తెస్తాడు. నాసమాధి సమీపంలో ఒక ఆలయం కట్టించి అందులో ఆ లింగాన్ని ప్రతిష్ఠించండి ' అని చెప్పేడు.
దశమినాడు ఆయన ఆదేశానుసారం తవ్వబడిన గోతిలో స్వామి ఉపవిష్ఠుడు అయ్యాడు వారి శిరస్సు నుండి ఒకదివ్య తేజం లేది ఆకాశం వైపుగా పోల్య్హి అదృశ్యమయింది.