ఈ పుటను అచ్చుదిద్దలేదు

జ్యేష్టశుద్ధ షష్టి

   అరణ్యక షష్ఠి అని గదాధర పద్దతి, స్కందషష్ఠి అని నామాంతరము.
   వింధ్యేశ్యరాజ్య: పూజా అని ఆమాదేర్ జ్యోతిషీ
   అరణ్య గౌరీ వ్రతం వింధ్యవాసినీ పూజ. అరణ్యాల్లో కొండల్లో గౌరిని పూజించేవారికి సౌభాగ్యం.
                            జ్యేష్ఠ శుద్ధ సప్తమి
      ద్వాదశ సప్తమీ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి
      వరుణ పూజ చేయాలై కొన్ని గ్రంధాలలో కలదు.
                         జ్యేష్టశుద్ధాష్టమీ
   ఆమాదేర్ జ్యేతిషీ గ్రంధం శుక్ల అష్టమిని దుర్గాష్టమిని దుర్గాష్టమి. త్రిలోచనాష్టమి నామాలతో పేర్కొంటూ ఉంది.
                       జ్యేష్టశుద్ధనవమి
     బ్రాహ్మణీ నామ్యా ఉమాయా, పూజా, శుక్లాదేవి పూజ ఈ రోజు ఆచరైంపవలసినవి.
                         జ్యేష్టశుద్ధ దశమి
                        దశపాపహరదశమి

  దశమి తిధితో సంబంధపడి మనకు రెండు పెద్ద పండగలు కనిపిస్తున్నాయి.
  ఒకటి జ్యేష్తశుద్ధ దశమి, రెండు ఆశ్వీయుజ శుద్ధ దశమి, మొదటిది దశపాపహరదశమి.  రెండవది విజయదశమి.  రెండూ కూడ పది రోజులు పర్యాస్తమయ్యే పాడ్యమి తిదులతో ప్రారంబమై దశమితిధితో ముగిసే పర్వాలు.
    దశపాపహర దశమి అనగా పది పాపాలను పోగొట్టే దశమి అని అర్ధము.  పది పాపాలను పోగొట్టడానికి సమర్ధమైన ఈ వ్రతము జ్యేష్ట శుక్ల పాడ్యమి నుండి దశమి వరకు చేస్తారు.
    ఈ పాడ్యమి నాటి వివరాలలో మన పంచాంగములో 'దశహరాదశాశ్వమేధేస్నానం, ఇత ఆతభ్య్హదశమీపర్యంతమి ' అని ఉంటుంది.
    ఈనాడు ఏనదిలో చేసినా స్నానం విశేషఫలప్రదమైనది.  అందులో గంగానదిలో చేస్తే గొప్ప విశేషం. అందులో కాశీలోని దశాశ్వమేధఘట్టంలో గంగా స్నానం మరీ విశేషం.