ఈ పుటను అచ్చుదిద్దలేదు
జ్యేష్టము
ఇది సంవత్సరములో మూడో మాసం
జ్యేష్టమాసాన గృహనిర్మాణానికి ఆరంభించిన మృత్యువు (మత్స్య పురాణము)
జ్యేష్ట శుద్ధ పాడ్యమి
ఈనాడు కరవీరవ్రతము: భద్రల్చ్లల్తుష్టయ వ్రతము చేయాలని వ్రత గ్రంధాలు పేర్కొంటున్నాయి.
జ్యేష్ట శుద్ధ తబయ
జ్యేష్ట శుద్ధ తదియ నాటి వివరణలో మన పంచాంగకర్తలు 'రంభావ్రతం ' అని వ్రాస్తారు. స్మృతి కౌస్తుభము, తిధితత్త్యము, పురుషార్ధ చింతాంఆనీ, చతుత్వర్గ చింతామణి మున్నగు గ్రంధాలు దీనిని 'రంభాతృతీయా ' అని అంటున్నాయి. రాజ్యవ్రతము, త్రివిక్తమతృతీయావ్రతము మున్నగు ఇతర వ్రతాలు కూడ ఈనాడు చేస్తారని ఉంది. వీటి అన్నిటిలో రంబావ్రతము కొంతవరకు ఆచరణలో ఉన్నట్లు కనిపిస్తుంది.
తపో నిష్ఠలో నున్న శివునకు ఉప్;అచరించడానికి హిమవంతుడు తన కూతురు పార్వతిని అప్పగించాడు. పార్వతి యందు శివునికి ప్రేమ కలగడానికి ఆసమయంలో మన్మధుడు తన బాణాలు ప్రయోగించాడు. శివునికి చిత్తం చెదిరింది. అందుతో శివునికి కోపం వచ్చి తన మూడవ కన్ను తెరచి చూచాడు. మన్మధుడు భస్మమయ్యాడు. శివుడు అక్కడినుంచి వెళ్లిపోయాడు.
పార్వతి చిన్నబుచ్చుకుని ఇంటికి వచ్చేసింది. తల్లి ఎదురుగా వచ్చి ఆమెను గుచ్చి కౌగిలించుకుంది. పార్వతి బావురుమంది. తల్లి ఓదార్చి ఆమెను తండ్రి అయిన హిమవంతుని వద్దకు తీసుకు వెళ్లింది. ఇంతలో అక్కదికి సప్తమహామునులు వచ్చారు. వారికి హిమవంతుదు తనకూరుతు సంగతి చెప్పాడు. అప్పుడు ఆమునులలోభృగువు 'బిడ్డా '! ఒక వ్రతం ఉంది ఆవ్రతం ఆచరిస్తే నీకు శివుడే భర్త అవుతాడు. అని అన్నాడు.
అప్పుడు పార్వతి 'మహాభాగా! ఆ వ్రతం ఎప్పుడు ఎట్లా చేయాలో అని అడిగింది.
దానికి ముని ఇట్లా చెప్పాడు. "బిడ్డా! ఆ వ్రతాన్ని పెద్దలు 'రంభావ్రతము ' అంటారు. రంభ అనగా అరటిచెట్టు. ఆ వ్రతాన్ని