ఈ పుటను అచ్చుదిద్దలేదు
శ్రీకాకుళానికి నలభైమైళ్ల దూరంలో వంశధారాతీరాన ఉన్న శాలిహుండాం కొండకు కూర్మాద్రి అనే పేరు ఉంది. శ్రీకాకుళానికి పది మైళ్లదూరంలో సముద్రానికి ఒకటిన్న మైళ్లదూరంలో శ్రీకూర్మం అనే ఊరు ఉంది. అక్కడ వైష్ణవాలయంలో కూర్మావతారం కూర్మనాయకులు అను పేర పూజలు అందుతూ ఉంది. కూర్మనాధ స్వామికి అనగా కూర్మావతారరూపి అయిన భగవంతుడికి ఆలయం భారతదేశంలో మరి ఒక చోట ఉన్నట్లు కానరాదు. ఆంధ్రప్రదేశ్ విషయంలో ఇది ఒక విశిష్ఠతగా మనం చెప్పుకొనవచ్చు.
కావున ఈ ఆలయమును గురించి కొంచెం విపులంగా తెలుసుకొందాము. "తాబేలు రూపమున శ్రీ స్వామివారి సాల గ్రామము గర్భాలయమున పూజింపబడుచున్నది. చంద్రవంశము నందు జన్మించిన శ్వేత చక్రవర్తికి ఈ కూర్మావతార రూపము ప్రత్యక్షమైనట్లును, అతనిచే అనేకిఅ సవంత్సరములు పూజింపబడినట్లును, అతని చేటనే ఆలయ ప్రాకార నిర్మాణమయినట్లును క్షేత్రపురాణమున గలదు. ఈ శ్వేత చక్రవర్తి యెప్పటివాడో తెలియుటలేదు. ఈ దేవాలయము నల్లరాతిపై చక్కని శిల్పముతో నలరారుచున్నది. ఇందలి లోపలి ప్రాకారముల స్తంభముల పంక్తి ఒకే రాతిపైని మంచి శిల్పముతో ఒక స్తంభంఊ ఫొళీఖా ఇంకొకటికాక అనేక స్తంబములతో నలరారుచున్నది.
శ్రీస్వామివారు వేంచేసి యున్న ఆలయమునకు శ్రీకూర్మవిమానమని విమానసంజ్ఞకలదు. ఈ విమానము నారసింహ, కపీశ, హయగ్రీష, దధివక్తుల విగ్రహములతోను, ఇంకననేక చిత్ర విచిత్రమైన విగ్రహములతో నలంకృతమై అష్టదళపద్మాకారముగ నుండుట వలన గాంధర్వ విమానమని కపిలసంహిత యందు చెప్పబడి యున్నది.
ఈ విమానమును దీని ననుసరించి భోగమంటపము పుష్పాంజలి మంటపము అష్టానమంటపము మొదలుగుమంటపములును, శంఖనిధి, పర్మనిధి, వైష్ణవీ దుర్గ అను పేరులు గల విగ్రహములను, అష్టాక్షర మంత్రోదార విన్యాసముగా బ్రహ్మప్రతిష్టయని ప్రసిద్ది గలది.
ఈ దేవాలయ చిత్రనిర్మాణము అద్భుతమగు పనితనముతో చిత్ర విచిత్రమగు లతా సముదాయముతో నలరారుచున్నది. ఈగుడి తూర్పుదక్షిణ ద్వారములకు గల పనితనము బంగారముపై జేయతగిన పనితనముతో నొప్పుచున్నది.
ఏ కారణము చేతనో ఈ దేవాలయమునకు సుమారు ఆరు అంగుళముల దళసరి గల సున్నముతో ఇందలి చిత్రములు కప్పబడినవి.