ఈ పుటను అచ్చుదిద్దలేదు

కలవని కాని లేనివని కాని చెప్పడానికి వీలులేని గోళ్లతో చీల్చి రాక్షసుని చంపివేశాడు.

  "ఉగ్రవీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం
  నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుంన్ అవరామ్యహం".

    అనే మంత్రంతో ఈ దినమున నరసింహమూర్తిని పూజిస్తే శత్రుజయం కలుగుతుంది. నృసింహ చతుర్ధశి వ్రతాన్ని హేమాద్రి, నృసింహపురాణం, స్కాందపురాణాలు వివరిస్తూవున్నాయి.
   వైశాఖశుక్ల చతుర్దశి సోమవార స్వాతీనక్షత్రం ప్రదోషకాలంలో నృసింహస్వామి అవతరించాడు.  స్వాతి నక్షత్రం శనివారం సిద్ధియోగంలో వ ఇజమను కరణంలో ఈ వ్రతం చేయడం పరమశ్రేష్ఠము. కాని ఎ విధమైన యోగంఅ కలిసిరావడం చాలా కష్టము.  ఆయోగం కుదిరిన నాడు నాపుట్టిన రోజు ఈ వ్రతం చేయతగింది.  నావ్రతం చేయడానికి అన్నివర్ణాలవారికి అదికారముంది."  అని నృసింహస్వామి వచించినట్లు స్కాందపురాణంలోకలదు.  ఈ వ్రతంచేయడానికిఅన్ని వర్గాల వారికి అధికారం ఉన్నట్లు చెప్పబడ్డా ఇది ఇప్పుడు వైష్ణవులే ఎక్కువగా చేస్తున్నారు.
    వ్రతవిధి, వైశాఖశుక్ల చతుర్దశినాడు ఈ వ్రత్రం చేయూలి.  ఆ రోజున ఎట్టి పాపంకాని చేయకూడదు.  మధ్యాహ్నం స్నానం చేయాలి.  గోమయశుద్ధమైన యింటాష్టదళపద్మం పెట్టి కలశ స్థాపన చేయాలి.  ఆ కలశం మీద బియ్యంతో నిండిన వెదురు గొట్టం వుంచాలి.  అక్కడ లక్ష్మీనారాయణుల విగ్రహాలు వుంచాలి.  శాస్త్రాచారప్రకారం వ్తతం జరపాలి. ఆకాలంలో దొరికే పూవులతో పూజచేయాలి.  రాత్రి జాగరణ చేసి పురాణకాల క్షేపం చేయాలి.  మరునాటి ఉదయాన్నితిరిగి పూజ చేయాలి.  తరువాత యధాశక్తి నృసింహప్రతిమాదానాలు, భోజంసాలు.
     మూల్టాన్ లో నృసింహజయంతి గొప్పగా సాగిస్తారు.  ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశిపుడు ఆ వూరివాడట.  ఆ సందర్బ చిహ్నాలు ఇప్పటికి కూడా వున్నాయి.