ఈ పుటను అచ్చుదిద్దలేదు

భగవద్బక్తులును విశిష్టులునగు భాగవతొత్తములకుపాస్యుండు కాడు. రామకృష్ణాతారంబులు షడ్గుణ పరిపూర్ణంబులుగావున విశిష్ట భగవద్బక్త విప్రప్రజనంబులకుపాస్యంబులై మోక్షంబులై మోక్షప్రదంబులగును"

                         పరశురామకుండము
   బ్రహ్మపుత్రనదీ తీరాన పరశురామ కుండం అనే తీర్దం ఒకటి ఉంది పరశురాముడు ఆకుండంలో స్నానం చేసి తల్లిని చంపిన తన పాతకాన్ని పోగొట్తుకున్నాడు.  ఇప్పటికిన్నీ పరశురామకుండం పెద్ద తీర్ధంగా ఉంటూ ఉంది.
   దశావతారాల్లో పరశురామావతారం ఆరోది.  విశాఖ శుద్ధేద్వాదశినాటి రాత్రి మొదటి జామున పునర్వసు నక్షత్రంలో పరశురామావతారము ప్రారంభమైందని స్కాందపురాణ, నిర్ణయసింధువులు చెప్పుచున్నవి.
   శ్రీ కృష్ణుని శ్రీ రాముని జయంతులు ఏమాదిరిగా జరుపుతున్నామో అట్లే పరశురామ జయంతి కూడా జరపవలసిందిగా మన శాస్త్రాలు ఆజ్ఞాపిస్తున్నాయి.  కాని ఈ జయంతి అంత విశేష ప్రచారంలో లేదు.  ఉత్తర హిందూ స్థానంలో మధుర, వారణాసి నగరాల్లో ఈ జయంతి విశేషంగా చేస్తారు.
    అస్సాముదేశంలో కామాక్షిదేవి గుడి వుంది అదే జమదగ్ని ఆశ్రమం అని చెబుతారు.  ఆ ప్రాంతంలో పరశురామూలయం కూడా వుందని తెలుస్తూ వుంది.
    దక్షిణ్ భారతదేశంలో మలబారు భూమి వున్నచోట కరువు వుండదట. రత్నగిరిలో పరశురామమందిరం వుంది.  అక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుంది.
   -వ్రతోత్సవ చంద్రిక
     ఈ రోజున పరశురాముడికి అర్ఘ్యం ఇస్తే శత్రునాశనమవుతుంది.
               వైశాఖశుద్ధ చతుర్దశి      నృసింహజయంతి
      స్మృతిదర్పణము, గదాధరపద్దతి, పురుషార్ధ చింతామణి, చతుర్వర్గ చింతామణి మున్నగు గ్రందాలన్నీవైశాఖ శుక్ల చతుర్దశిని నరసింహ జయంతి అని కంఠోక్తిగా చెప్పవచ్చు.