ఈ పుటను అచ్చుదిద్దలేదు
మఱియు స్కాందపురాణాములోని వహ్యాద్రి ఖండములో పరశురాముని గుఱించి ఇట్లు వ్రాసినారు. తాను కశ్యప బ్రాహ్మణునిచే వెడలగొట్టబదిన వాడై సహ్యాద్రిపర్వత ప్రాంతమందు నివచించి అందు బ్రాహ్మణుడు లేకుండుటను చూచి అచ్చటి అటవికులైన కొండ జాతివారి మెడలలో జందెములు వేసి వారిని బ్రాహ్మణులనుగా చేసెను.
ఇంతటి సంస్కార కార్యము సామాన్యమైనదికాదు."
బ్రాహ్మణుల పక్షము వహించి క్షత్రియులను సంహరించి సంఖ్యదిక్యము కొఱకు అటవిక్లను కూడ జందెమువేసి బ్రాహ్మణత్వమాపాదించి బ్రాహ్మణ పక్షపాతము చూపిన్ ఈ బ్రాహ్మణుడు బ్రాహ్మణ కులుమునకే సాందాయముగా ఒక శాప మిచ్చినగాధ ఒకటి ఉంది. దానిని తర్కాచార్య భాషాప్రవీణ శ్రీ కంభంపాటి రామగోపాలకృష్ణమూర్తి ఇట్లు చ్వెప్పుచున్నారు.
"యజ్ఞము చేయించింస్ బ్రాహ్మణులకు పరశురాముడు తాను జయించిన భూభాగమంతయు దక్షిణగా నిచ్చి వేసెను. పిమ్మట ఒక చోట ఆశ్రమము వేసికొని జపము చేసికొనుచుండగా కొందరు బ్రాహ్మణులు వెళ్లి 'నీవు దాన మిచ్చి వేసిన భూమిలో నీవిక ఉండరాదు. దానమిచ్వినది తిరిగి పుచ్చుకొనరాదు అని కఠినముగా పలికిరి. దానితో కోపించి అతడు 'జపము చేసికొనుటకు కూర్చున్నంతనే భూమి పోవునా! ఇట్టి నీచస్వభావమే కాని ఉదార బుద్ది మీకు లేదు. కానమీరెన్ని దానములు పట్టినను, ఎంతగా కష్టపడినను విద్యలు వచ్చునేకాని ధరమురాదు ! వచ్చినను నిలువ ఉండదు ' అని శపించి తాను పడమర సముద్రతీరమునకు పోయెను.
పరశురామావతార విషయంలో కొన్ని విలక్షాలు కనిపిస్తాయి. పరశురామావతారము తరువాతది రామావతారము. కాలములో, నామములో రెండూ సన్నిహితమైనవి. ఆజన్మక్షత్రియ కులహంత అయిన పరశురాముడు క్షత్రియుడైన రాముని చేతులలో తుదకు ఓడిపోయాడు. శివధనుస్సు విరిచి వివాహితుడై వచ్చుచున్న రాముని ఎదిరించి పరశురాముడు భంగపడ్డాడు. విష్ణువు యొక్క ఒక అవతారము చేత మఱిఒక అవతారము ఓడింపబడిన సందర్భం ఇది ఒక్కటే.
పరశురామావతారము గురించి పద్మపురాణములో ఇట్లు ఉంది. "పరశురాముడు భగవచక్త్యావేశావతారుండగుటంజేసి మహాత్ములును