ఈ పుటను అచ్చుదిద్దలేదు

వైశాఖ శుద్ధ ఏకాదశీ

                                       మోహిన్యేకాదశీ
 ర్ఫసవంతుడైన ఒక కోమటి తన ధనాన్ని అంతటినీ దుర్వ్యయము చేశాడు.  అప్పుడు బందువులు అతనిని యింటినుండి వళ్లగొట్టారు.  ఏమీతోచక అతడు ఒక అడవికిపోయి అంది తిరుగుతూ ఉన్నాడు.  అక్కడ ఒకముని కనిపించి అతనికి ఏకాదశి వ్రతాన్ని ఉపదేశించాడు.  ఆకోమటి ఎనాడు ఏకాదశీ వ్రతాన్ని చేసి పుణ్యం వలన తిరిగి ధవవంతుడు అయ్యాడు.  అందువల్ల ఈ ఏకాదశి మిక్కిలి ఫలకారి.
                          వైశాఖ శుద్ధ ద్వాదశి
                           పరశురామ జయంతి
    వైశాఖశుద్ధ తృతీయ పరశురామ జయంతిగా హిందువుల పండుగలు, పేర్కొంటూ ఉంది.  వ్రతోత్పవచంద్రికాకారుడు కూడ ఇట్లే వ్రాయుచున్నాడు.  మార్గశీర్ష బహుళ విదియ పరశు;రామ జయంతి అని మరి కొందరు. చతుర్ఫ్వర్గ చింతామణ్తి వైశాఖశుద్ధ ద్వాదశి జామదగ్న్వ వ్రతమ దినము అని చెబుతున్నది.  స్మృతి దర్పణము మున్నగు గ్రంధాంతరాలలో ఈనాడు మదుసూదన పూజా, వైష్ణవ ద్వాదశీ, రుక్మిణీ ద్వాదశీ వ్రతం అని కలదు.  మన పంచాంగాలలో ఈనాటి వివరణలొ పరశురామ ద్వాదశి అని ఉంటుంది.  కాగా ఈ దినమే పరశురామ జయంతి దినంగా చేకొనవలసి ఉంటుంది.
    పరశురాముడు విష్ణువు యొక్క దశావతారాలలో ఆరో అవతారం అతడు వైశాఖశుద్ద ద్వాదశి నాడు రాత్రి మొదటి జామున పుంర్వసు నక్షత్రంలో ఆరు గ్రహాలు ఉచ్చంలో ఉండగా పుట్టాడు.  తండ్రి జమదగ్ని, తల్లి రేణుక, ఆమె క్షత్రియకాంత.  ఇది ఒక అమలోమ వివాహము.
    పరశురాముడు మిక్కిలి చిన్నతనంలో తన తండ్రి పితామహుడైన భృగువు ఆశ్వమానికి వెళ్లా?డు.  అతని తేజస్సుకు తాళల్?ఏక భృగుముని శిష్యులు కళ్లు మూసుకొన్నారు.  ముత్తాత ఇతనిని హిమాలయ పర్వతాల మీదకు వెళ్లి శివుని గూర్చి తపస్సు చేయమన్నాడు.  అతడు వెళ్లి తపస్సు ప్రార్ంభించాడు.  శివుడు ప్రత్యక్షమై రామా! నీవు ఇంకా చిన్నవాడవు. రౌద్రాస్తారులు ధరించే శక్తి నీకు ఇంకా కలగలేదు.  కొంతకాలం తీర్ధయాత్రలు సాగించి తిరిగి రావలసింది అని చెప్పాడు.