ఈ పుటను అచ్చుదిద్దలేదు
ప్రశాంతంగా జీవిస్తూ మత ప్రచారం చేస్తూ ఉండినాడు. కాని ఇంతలో అతనికి మళ్లీ కష్టాలు కలిగాయి.
అప్పటి చోళరాజు కుళోత్తంగుడు. అతడు శైవుడు శివునికి మించిన దైవం లేడనే సిద్ధాంతం అందరూ ఒప్పుకోవాలని అతడు నిర్భంధించాడు.
ఇది వైష్ణవమత ప్రచారకులకు గొడ్దలి పెట్టు అయింది. రాజు దర్శనానికి వావలసిందిగా రామానుజుడికి కబురు వచ్చింది. రాజు రామానుజుడికి ఏదో హాని తలపెట్టాడని అర్ధమై పోయింది. కురత్తాళ్వారు రామానుజుడి దుస్తులు ధరించి రాజు వద్ధకు వెళ్లాడు. రాజి శివుడు తప్ప మరోదైవం లేడనే సిద్ధాంతాన్నిఒప్పుకోమన్నాడు. ఆళ్వారు అంగీకరించలేదు అందుమీద రాజు అతని గ్రుడ్లు పీకించాడు.
ఈలోగా రామానుజుడు వాయువల బిత్తి దేవుని రాజ్యంలోకి పారిపోయాడు. కావేరి తీరం వెంబడినే ప్రయాణం చేస్తూ అతడు సాలిగ్రామం అనే తావు చేరి అక్కదై పన్నేండేళ్లు నివసించాడు. వాదంలో జైనులను ఓడించి బిత్తిదేవుని వైష్ణవుడుగా మార్చాడు.
అతని వద్ద తిరుమాన్ : (శ్రీఫందనం) చెక్కలు అన్ని అయిపోయాయి. వానికోసం అన్వేషించడంలో ఈతనికి మేల్కోటలోని ఒక చిన్న దేవాలయం కనిపించింది. డిల్లీరాజు రాజభవనంలోని రామప్రియ అనే విగ్రహాన్ని తెస్తూ ఉండగా ఒకానొక గ్రామంలోని పంచములు అతనికి ఆశ్రయం యిచ్చారు. అందుకు మెచ్చి రామానుజుడు మేల్కోటలో రధోత్సవం జరిపే రోజున ఆ ఆలయంలో పంచములకు ప్రవేశం కలిపించాడు.
చోళరాజు కులోత్తుంగుడు మరణించాక రామానుజులు శ్రీరంగానికి తిరిగి వచ్చాడు. తన అనంతరం మత ప్రచారానికి డేబ్బైనలుగురు శిష్యులను నియమించాడు. అందులో నలుగురు ముఖ్యులు అతని భాష్యప్రతులకు పూటకాపులైరి. ఇతడు శ్రీరామానుజులు నూటఇరవై ఏళ్లు బ్రతికాడు.
ఇతడు వ్యాస సూత్ర భాస్యము, గీతాభాష్యము, తర్కభాష్యము మున్నగు గ్రంధాలు వ్రాయడం చేత భాష్యకారులు అనే పేరు వచ్చింది. ఎంబెరుమానారు అని అతనికి మరి ఒక పేరు. త్రిదండసన్యాసికావడం