ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామానుజుని ప్రతిభ విన్నాడు. అతడు రామానుజుని తీసుకురమ్మని తన శిష్యుడైన పెరియనంబిని పంపాడు. ఇంతుకుముందే రామానుజుడు ఆళవందారు ప్రతిష్టవిని ఉన్నాడు. అతన్ని చూడాలని ఈ వఱకే అనుకుంటూ ఉండినాడు. కాగా వెంటనే అతడు శ్రీరంగానికి ప్రయాణమయ్యాడు.

   ఆళవిందారు అప్పటికి పండుముసలి, రామానుజుడు శ్రీరంగం వెళ్లే సరికి కొద్ది గంటల ముందు ఆళవందారు చనిపోయాడు.  అతడు ఆళవందారుని శవాన్ని మాత్రం చూడగలిగాడు. ఆ శవంచేతి వేళ్లలో మూడు వింతగా ముడుచుకుని ఉన్నాయి.  ఈ వింతయేమిటని రామానుజుడు ఆళవందారు శిష్యుల్ని అడిగాడు. ఆళవందారు కోరికలు మూడు నెఱవేఱకుండా ఉండిపోయాయి అనీ, ఆ వేళ్ల ముడుపు దానికి చిహ్నమనీ శిష్యులు చెప్పారు.  ఆ మూడు కోరికలు ఏమిటంటే బ్రహ్మసూత్రాలకు, సహస్ర నామాలకు, తిరువాయి మొళికి సులభార్ధబోధమమైన వ్యాఖ్యానాలు వ్రాయడం అని తేలింది.  ఆ మూడు పనులు తాను చేస్తానని రామానుజుడు వాగ్ధానం చేశాడు.  ముడుచుకుని ఉన్న ఆళవిందారు మూడు వేళ్లుతోడనే తెరుచుకున్నాయి.
   ఆనంతరం రామానుజుడు కంచికి తిరిగి పోయాడు.
  ఇట్లా కొంతకాలం గడిచింది.  ఆళవిందారు కోరికలు మూడున్నూ అట్లాగే ఉండిపోయాయి.  ఆళవందారు ప్రధాన శిష్యుడైన పెరియనంబి వద్ద కొంతకాలం చదిని ఆ మీద గ్రంధ రంచనక్ పూనుకుందామని రామానుజుడు శ్రీ రంగానికి బయలు దేరాడు.  మార్గమధ్యాన మధురాంతకంలోనే అతనికి పెరియనంభి దర్శనం దొరికించి.  అక్కడే రామానుజుదు అతని శిష్యుడిగా ఛేరాడు.
   ఇద్దరు కలిసి కంచికి వచ్చారు.  విధ్యాభ్యాసం మొదలయింది ఆరుమాసాలు గడిచాయి.  ఇంతలో ఇంట్లో పెరియనంబి భార్యకున్నూ రామానుజులు భార్యకున్నూ షష్టాష్టమైంచి.  అందుచేత పెరియనంబి రామానుజిది ఇంటిని వదిలి కంచి నుంఛి శ్రీరంగం వెళ్లిపోయాడు.
   తన భార్య కజ్జాకోరెఉతనంతో రామానుజుడు విసుగెత్తి పోయాడు.  లోగడ రెండుసారులు అతను ఆమెను మన్నించి ఉన్నాడు.  కాని ఈ సారి అతడు ఇక సహించలేకపోయాడు.  తన భార్య గయ్యాళి తనం కారణంగానే