ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధర్మపాలమహారాజు కథ

89


పదియవనాటి రాత్రి కథ.

పదియవనాటి సాయంసమయమున, కేశవార్జునులు యథాప్రకారముగా, పెందలకడ మృష్టాన్న భోజనంబు లొనరించి, యమునా సైకతస్థలంబున కరుదెంచి, మందవాతపోతంబు లానందముం గలిగింప, తాంబూలచర్వణం బొనరించుచున్న యవసరంబున నరుఁడు నారాయణుంగాంచి యిట్లనియె, “వసు దేవనందనా! యుష్మత్కృపావశంబున, ననితర లభ్యంబులగు తొమ్మిది ముక్తిమార్గంబులఁ గధారూపంబున నెఱుంగఁగల్గితి; ధన్యాత్ముఁడనైతిని——నేటిరాత్రి పదియవదియగు దర్పణము నెఱింగింపవే! యని ప్రార్థింప నా వాసుదేవుండియ్యకొని, యిట్లు వచింపజొచ్చెను. "కుంతీనందనా ! ధర్మపాలుండను మహారాజు చరిత్రంబు నాకర్ణించితివేని, దర్పణమహాత్మ్యంబు దెలియనగు"నని పలికి యేతచ్చరిత్రము నిట్లు వినిపింపదొడఁగెను.

ధర్మపాలమహా రాజు కథ.

పూర్వకాలమున, కీర్తిపాలుఁడనురాజు మహారాష్ట్ర దేశముం బరిపాలించుచుండెను. ఆ రాజునకు బహుకాలంబు పుత్ర సంతతి లేమిం జేసి, ధర్మపత్ని యగు నూర్మిళాదేవి యనుమతంబున, కాంతిమతియను బాలికను పరిణయంబాడెను. ఆవివాహలగ్నం బెట్టిదియోకానీ, యనతి కాలముననే, యూర్మిళాదేవికి, ధర్మపాలుండను సుతుండును, కాంతిమతికి, వీరపాలుండను సుతుండునుం గలిగిరి. లేక లేక కలిగిన సంతతి యగుటం జేసి, యా భూమీశుం డమితానందము నంది—— బీదలకు సాధువులకు నశేషదానంబులుసలిపి. పుత్రుల నల్లారుముద్దుగా బెంచుచుండెను. అంత విధి వశంబున బాలుర యభివృద్ధితోపాటు, సవతికుమారుఁడగు ధర్మపాలునిపై కాంతిమతికి మాత్సర్యంబు సయిత మభివృద్ధి నందజోచ్చెను. అంత నొక్కనాడు, భూకాంతుఁడు, తనతో మంతన