ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

పండ్రెండు రాజుల కథలు


తత్కాలంబునం దొక్కనాడు, ధనంజయుండు మధుసూదను నవలోకించి—— "నారాయణా! షడృతువులందును, వసంతంబు సంతస ప్రదంబై నదిగా నొప్పారు. ఇది యట్టి మహానందదాయకంబగు వసంతకాలముగావున, మnaమిరువురము నీఋతువునం గొన్ని దినంబులు, సుఖప్రదంబగు యమునా సైకత స్థలంబున విహరించి రాఁగుతూహలమయ్యెడు. నీకిదియభీష్టంబే?" యని సంప్రశ్నింప గోవిందుఁ డందుల కనుమతింప, నామఱుసటి దినంబుననే యన్నరనారాయణు లిరువులును, సమంచిత సన్నాహముతోఁ గదలి, యమునాతీరంబున కరిగిరి.

తన్నదీతీరంబునఁ బటకుటీరంబుల నేర్పఱచుకొని యాబావమఱందులు పగటివేళ, తత్ప్ర దేశస్థ ప్రశస్థనన సౌందర్యంబును గని యానం దించుచు, పరిమళమిశిత మృదు పుష్పభరిత లతానికుజంబుల, నుపవసించుచు, తన్మధురపరిమళమిళిత వాయువుల నాఘ్రాణించుచు సరసాలాపంబులఁతోడను, నిష్టలీలలతోడను, క్రీడావినోదంబులతోడనుఁ బ్రోద్దులుపుచ్చి, సాయంకాలమైన వెంటనే, పంచభక్షాయితంబగునో దనంబునుగుడిచి, యమునా సైకతస్థలంబులంజేరి, సంపూర్ణ చంద్రికా ప్రకాశంబున, నుపవిష్టులై మనోహర తాంబూల చర్వణముంగావిం చుచు, మందమందశీతల పవమానంబులకు బ్రమోదమానమానసులై యిష్టగోష్టిఁ గావించుచున్న సమయంబున శ్వేతవాహనుండు త్రివిక్రముం దిలకించి యిట్లనియె.

“మహానుభావా! యదునందన! పురుషోత్తమ! నినుబోటి మహాత్ముల సాన్నిధ్య భాగ్యంబు గల్గుట యనన్య దుర్లభంబు అట్టి యవకాశంబు తన భాగ్యవశంబునఁ గల్గినయెడ నద్దాని వ్యర్ధంబొనరించుకొనిన నరుండవివేకియగు. కావున, దివ్యచంద్రికా ప్రకాశంబువలనను,మనోజ్ఞమలయ మారుతంబులవలనను నిర్మలంబైన నాహృదయంబిప్పుడు కొంత జ్ఞానమార్గంబునుగఱచి కృతార్ధతనంద నభిలషించుచున్న యది; దేవమానవాదుల కెట్టిమార్గంబున పునర్జన్మరహితంబైన దివ్యమోక్ష