ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

పండ్రెండురాజుల కథలు.


వెడలిపోవుచున్నందులకు విచారించుచు శుచిముఖి దృక్పథము నతిక్రమించి చనిన వెనుక యధాప్రకారంబున నాబరిణం గఱచుకొనియందే యుండెను.——సాయంకాలమగునప్పటికి శుచిముఖి యిల్లు సేరి యానందముతో నాబరిణను మణిమాల కొసంగి, తానొనరించిన చిత్ర ప్రకారంబుల నెఱింగించి ప్రమోదసాగరంబునముంచెను. ఆ రేయి యధాప్రకారంబుగ, నేకాక్షి విహారంబునకరుగ, రాజకుమారుం డొకమహాగ్నిజ్వాలను నిర్మించి, యాబరిణయం భస్మంబుగావించెను, ఎందేని విహరించుచున్న యేకాక్షి శరీరం బెల్ల నగ్ని జ్వాలాపరితప్తమైపోవ, తనువున బొబ్బ లెక్క——"మోసముమోస” మని చతుర్దశ భువనంబులు బ్రతిధ్వనించు చాడ్పునఁ గేకలు పెట్టుచు, మార్గమధ్యంబునబడి నడగొండచాడ్పున విగత ప్రాణియయ్యె ను. అనంతర మామణిమంజరీ విక్రమసేనులు నిజవురాభిముఖులై శుచిముఖితోడను రాత్రించరి సేకరించి యుంచిన నవరత్న రాసులతోడనుంగదలి శాఖాగ్ర మాధారముం జేసికొని కొంత కాలంబునకు వృక్షమూలముం జేరి కరవాలముంబరీక్షింప దానియొఱకు త్రుప్పుపట్టియుండెను ఆసంకేతనమును గ్రహించి తన ప్రియమిత్రుండగు, గుణసాగరున కపాయంబుగల్గినట్లు నిశ్చయించి పెద్దతడవు వాపోవసాగెను. అనంతర మావిక్రమసేనుడు తన మిత్రునిజాడనరయ, నారెండవకొమ్మపైఁ బయనంబొనరింపఁదలంచియు, మాణిమాలాశుచిముఖుల నేమి చేసిపోవుటకునుందోఁపనివాఁడై ——యప్పటికి విశేషంబగుచున్న కుద్బాధం దీర్చుకొని పదంపడి కర్తవ్యం బాలోచింపఁదలంచి, యం దెందేనిజనపదంబు గలదేమోయని కొంతదూరం బరుగునంత దూరంబున నొక్క దేవాలయశిఖరంబు లోచన గోచరంబయ్యెను. అంత నాతండ త్యాశతో తదాలయాభిముం ఖుండై చనుచుండ నొక జటావల్కలధారియగు మునీంద్రుం డాతనికి గాన్పించి, యత్యాదరంబున నెదుర్కొని “ బాలకా! నీవెవ్వండ విందు కాంతాసహితుండవై తిరుగ గారణమే”మని ప్రశ్నించె, విక్రమసేనుఁడామునికిం బ్రణమిల్లి తనయుదంతం బామూలాగ్రముగం దెలిపి,