ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జీమూతవాహనమహారాజు కథ.

77


యం బాలోచించి, ఆటవిక నాయకుండగు ప్రచండునికడ కరిగి యాతనిచేఁ బూజింపఁబడి, కాశ్మీరరాజ్యమునందలి వృత్తాంతములను విపులయొనర్చుచుండిన నిగూడ దుష్కృత్యంబులనుఁ దెలిపి, “ప్రచండా! రేపటి రాత్రి నీవు నీ పరిజనులతో నొరు లెరుంగనిరీతి చారుదత్తుని కారాగృహంబున వేచి యుండి, యటకు విఫులవచ్చిసంతనే యాకులటనుబట్టి బంధింపుము. ఇంతలో నే నన్యమార్గంబున రాజు నటకుగొనివచ్చి రహస్యప్రకాశంబొనరింతు”నని పలికి యాతనిచే నట్లనిపించుకొని చనియెను. ప్రచండుఁడును దన ప్రయత్నము నందుండెను. నిరంతరాటవీ నివాసంబునకు రోసిన జగన్మోహిని యాదినంబుననే నాగరికలోక సందర్శనకుతూ హలాయత్తచిత్తయై——కాశ్మీర దేశ రాజధానియగు శ్రీనగరంబునకరిగి, యందందుగల చిత్రంబులం గాంచుచు, నప్రయత్నంబుగ, రాజోద్యానంబున కరిగెను. అంతకుఁ కొంత కాలమునకుఁ బూర్వ మటకు వాహ్యాళికై యరుదెంచిన జీమూతవాహనుం డబ్బాలికాతిలకమును, జగన్మోహిని యారాజకుమారుని నన్యోన్యముం జూచుకొనినంతనే——అపుడపుడే యౌవనచిహ్నాఁబులు పొడసూపుచున్న యాబాలబాలికల హృదయంబుల ప్రేమాంకురము లావిర్భవించెను. అంత వారిరువురుం దమతమ మానసాభిప్రాయంబుల నోండోరులఱింగించుకోనుచుండిరి. ఆదినంబుతో నారాజకుమారునకు పదునాఱు వత్సరంబులును నిండుచుండెను. అప్పటికి సరిగా నొకజాలరి గొనివచ్చిన మత్స్యంపుటు దరంబున దివ్య కాంతిభాసురమగు నొక తారహారము లభింప దానింగోయుట కేర్పరుపఁబడిన పరిచారకుఁడు పూర్వోక్త వాగ్దాన ప్రకారముగ నాహారము నతిరహన్యముగఁ గొనిపోయి విపులాదేవి కరంబుల నిడియెను. విపుల విపులానందభరిత మానసంబున దానినిధరించి, యందులకు మారుగ మఱియొక ముక్తామాలికను సబహుమానంబుగ నాపరిజనునకిచ్చిపంపెను. ఏక్షణంబున విపుల యా హారమును ధరించెనో యప్పుడే ——జగన్మోహినితో సరస ప్రసంగమొనరించుచున్న జీమూతవాహనుం డటులే విగతజీవియై ధరా