ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కృష్ణార్జునుల యమునాతీర విహారకథ

3


గింప, నప్పాండుసుతాగ్రజుండగు యుధిష్ఠిరుండు నిజసహోదర చతుష్టయంబుతోఁగదలి పుర బహిఃప్రదేశంబుననే, కేశవు నెదుర్కొని సన్మా నింప, నాగోపాల దేవుండు దర్మజునకు నమస్కరించి, భీముం గౌఁగిలించుకొని, పార్థుని నమస్కృతులనంది, కవల నాశీర్వదించి, యందఱితోఁగలసి మహానందంబున సరససల్లాపంబులనాడుచుఁ బుర ప్రవేశం బొనరించెను. అంత యుధిష్ఠిరుండు, శ్రీకృష్ణునకు తదనుగమ్యమానులగు పరిచార పరిచారికావర్గంబులకునుం దగిన విడుదులంజూపి, మార్గశ్రాంతిని, వాసి సుఖోపవిష్టుండై యున్న పిదప నాముకుందునిఁగాంచి సాధువచనంబుల "నో ఫురుషోత్తమా! అజరుద్రసురేంద్రాదులకైన నలభ్యంబగు నీ బాంధవంబు మముఁబోటి ప్రాకృతజనులకుఁ గల్గుట మాపురాకృత పుణ్యవిశేషంబ ——దాని నట్లుండనిమ్ము——మహా రాజాధిరాజులును, దివ్యర్షి చంద్రులును, బహువర్షఁబుల యుష్మన్మందిర ద్వారంబునఁ బడిగాపులువడియుండినను లభింపఁబోని తద్దిన్య దర్శన భాగ్యం బయాచితంబుగ మాకు నేడులభించుట కెద్దియో విశేష కారణంబుండక పోదు తత్కారణం బెట్టిదియో దయతో నెఱింగింపవే?” యని పలుక, నాజగన్నాధుండు, తానరు దెంచిన కారణంబు నామూలచూడముగా నెఱింగించి, పాండవులకు వేర్వేఱుగాఁ దాఁ గొనివచ్చిన వస్రాభరణాదులను సమర్పించి, రథగజతురగ సేనాసంచయంబును యుధిషిరుల కర్పణంబుఁ జేసి, యదనంతరంబు, సుభద్రాపాంచాల్యాద్యవ రోధజనంబుల యభ్యంతర మందిరంబులకరిగి, వారివారికి వేర్వేఱసారెలను, చీనిచీనాంబరాభరణాదులను పరిచారి కాజనంబులను నొసంగి, సహోదరీ మణులను శుభదృష్టి నాశీర్వదించి, ప్రత్యేకముగ సుభద్రకునీతులంగఱపి, వచ్చిన కార్యంబును సాకల్యంబుగ నెఱవేర్చుకొనిన పదంపడి, యుధిష్ఠిరాది పాండునందన ప్రార్థితుండై కొన్ని దినంబు లింద్రప్రస్థనగరంబున వసియించెను.