ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

పండ్రెండురాజుల కథలు


కతిపయదినంబులు నీలకేతనుఁ డందుండ నాతనికొక పుత్రరత్నంబుదయించె. అంతట బాలునకతి విభవంబున జాతకర్మనామకరణాది శుభకార్యంబు లొనర్పంబడియె. అంత నీలకేతనునకు మణిమంజరి స్మృతికి వచ్చుటయు నాతఁడు మామగారితో తదభిలాషముం దెలిపి నిజపుత్ర జాయాసహోదరీ కతిపయపరివారధనకనక సమేతంబుగ యక్షేశ్వరుం డొసంగిన పుష్పకంబునధిరోహించి కుంతల రాజ్యంబునం బ్రవేశింప నారాజేంద్రుఁ డాతనిరాక నెఱింగి పరమ ప్రీతి నాతనినాహ్వానించి పర్వంబుగా నానందించెను. అంతనొక శుభ దినంబునఁ మణిమంజరీ నీలకేతనులకును, పాంచాలా మాణిభద్రులకును కల్యాణంబులయ్యెను. కల్యాణానంతర మొక్క మాసంబునకే మణిమంజరి దేదీప్యమానయై వెలుంగు నొకకన్యకం బ్రసవించెను. అనంతరమానీలకేతనుఁడు, భార్యాయుగళమును, పుత్రికా పుత్రకులను వెంటనిడుకొని. సోదరితోడను, బావమఱఁదితోడను గదలి నిజరాజధానికరిగె. పుత్రవిశ్లేషంబునను జరాభారంబునను వ్యాధిశయ్యాగతుండైన సూర్యకేతనమహారాజు నిజకుమారాగమనంబుల కలరి, రాజ్య భారంబు నాతనిపై నిడి తాను వానప్రస్థాశ్రమ స్వీకారంబొనరించే, నీల కేతనుండును బహు వర్షములు రామరాజ్యముంబోలి ప్రజాపాలనం బొనరించి సత్కీర్తిగణించెను.” అని శ్రీకృష్ణుం డర్జునున కెఱిగించెను.