ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నీల కేతనమహారాజు కథ

67


వేసెను. యవనికాభ్యంతరమునుండి భర్తృదారికా భర్తృదారకుల ప్రసంగమెల్ల నాకర్ణించుచుండిన కాల కేతనుఁడు, దీనవదనయై తనకడ కరుదెంచిన, యా మణిమంజరింగాంచి, "మంజువాణీ! నీ సోదరుం డాడిన పలుకుల నెల్ల నాకర్ణించితిని. ఇప్పట్టున మన మెద్దియేని యభ్యంతరంబును వచించి నీ సోదరునిమనంబును చిన్న బుచ్చితిమేని మనల ననుమానింపఁగలరు. అందువలన బ్రమాదము వాటిల్లఁగలదు. అదియునుంగాక, విశేషించి, మనకు సంస్థానమర్యాద నిల్పుటయుఁ గర్తవ్యము. నే నాపండితుని యుక్తవిధంబున నోడించి, నామర్యాదకు భంగముకలుగ కుండ, మనగుట్టు బయల్పడ కుండ రాగలను. నీవిందుల కెంతమాత్రమును సంశయింపక నాసమ్మతి నెఱిఁగింపుమనిపలికెను. అంత నా మణిమంజరియు వల్లేయని యట్లయోనరింప నియమిత కాలంబునందు కపట కాంతా వేషదారియగు కాలకేతనుఁ డప్పండితునితో చతుషష్టి కళలయందును, ఛందోతర్క వ్యాకరణ మీమాంసాలంకారాది శాస్త్రములయందును, అమోఘంబగు వాదం బొనరించి, యామమాత్ర కాలంబునఁ బరాజితునిగా నొనరించెను. తద్వాదకాలంబున, నప్పుండితుని సమక్షంబున రాజకుమారుండగు, మాణిభద్రుండును నాసీనుఁ డై యుండెను. కాల కేతనుఁడు స్త్రీ రూపంబున, త్రిలోక మోహనుండై కాన్పించుచున్నందున, నతఁడు నిక్కముగ కాంతయే యను భ్రమంబున, నాకపట కాంతయందు లయంబయిన చిత్తంబుతో నొడలు మఱచియుండెను. నాటి రాత్రి కాలంబున, మాణిభద్రుడు నిద్దుర పట్టక నిజశయ్యా తలంబునఁబడి దొరలుచు, తీవ్రతర మదన జ్వరపీడితుండై ప్రలాపించుచు నా కాంతాలలామంగూడు వెఱ వెద్దియని వితర్కించి, తుదకు మణిమంజరిసఖియగు, సునందను జేరం జీరి, తనవిరహావస్థ నామె కెఱిఁగించి, యే యుపాయంబుననేని యానతిం దనకుఁ గూర్చినయెడల గొప్పబహుమానం బొనరింతుననిపల్కి యామెచే నట్లనిపించుకొనియెను——సునందయు వ్యాకుల చిత్తంబున మణిమంజరి కడకరు దెంచి, "సఖీ ! మన మొకటితలంప దైవమిం