ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

పండ్రెండురాజుల కథలు


వార్తలను బట్టి చూడ, చారుదత్త వలచిన నీ రూపుగలవాఁడే యితండని తోచెడును. ఆబాలకు నెన్ని విధంబుల దఱచి యడిగినను తన చరిత్రముం జెప్పక నిరంతర మెద్దియో విచారించుచుండును. ఇక్కడి వృత్తాంతమిది" యని తెలిపెను, అంత, హరిదత్తుఁడు స్వపరివారము నందే యుంచి, వసంతద్వితీయుఁడై వెనుకటి సత్రంబునకరిగి, యందు వెనుకటి వలెనే ప్రచ్ఛన్నంబుగ నుండ యధావిధంబున తైలాభ్యంజనం బొనరించు నెడ తలయంటుచున్న దాసి, హరిదత్తుని మణి బంధమునంగల, రక్షం గాంచి పెద్దగా నొక్క కేక వేసి, “హా! కామవర్థనా! కామవర్థనా! నాతండ్రీ! ఎన్ని నాళ్ళకు గనఁబడితివిరా నాయనా!" యని పలుకుచు వెఱ్ఱిదానివలె గంతులు వేయుచు, నానందాశ్రువులు వరదలై ప్రవహింప, మాటిమాటికి నాతని ముద్దిడుకొనఁ దొడంగెను——ఆదాసి విపరీతచర్యలు తనకర్థముగాక హరిదత్తుఁ" డవ్వా! నీకు వెఱ్ఱియెత్తినదా యేమి? ఇట్లేల పల్కెద"వని యడుగ, నాదాసి, తాను శాంతయగుటయు, వెనుక నష్టవిభవులై యాతని మాతాపితలును తానును గుహలోనుండి పారిపోవుచు వేరగుటయు నెఱింగించి——"నాయనా! ఆనాడు నేను నీతలిదండ్రులంగానక నీతో నొక వృక్షచ్ఛాయకువచ్చి శనివలె నన్నావహించిన నిద్రావేశంబున బడలినిద్రించితి. కొండొకవడికి లేచి చూడ నీవెందునుం గానరాకున్నంత నీ వేయడవి మృగంబుల వాతంజిక్కి తివోయని దుఃఖించుచు, సకలపుణ్యక్షేత్రములం దిఱుగుచుంటిని. నేటికి వింశతిదినంబులకు బూర్వము జగన్నాధ క్షేత్రమున నొకచోభిక్ష మెత్తుకొనుచున్న నీతలిదఁడ్రులంగాంచి నీదుర్గతి నెఱింగింప వారుదుఃఖించి, మార్గమధ్యంబున నీజనని కొక పుత్రుండు గల్లెననియును వానిని పోషింపలేక, కాళీపురంబున విష్ణు పాదుఁడను నొక విప్రునకు పెంచుకొన నిచ్చితిమనియుం జెప్పిరి. ఇప్పుడు నీతలిదండ్రులీసత్రంబుననే యున్నారు. రమ్మని——యాతనింగొనిపోయి వారలంజూప——బహుకాలానంతరంబున సమావేశంబైన యాజననీ జనకుల యొక్కయు పుత్రుని యొక్కయు, నందఱకన్న దాసియొక్కయు నానందము వర్ణనా