ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కామవర్ధన మహారాజు కధ

53


బిరుదంబు లెట్టివియో కనుంగొని, తన భృత్యులం గొందఱి——నపురూపాటవిక వస్తునిచయంబులతోడ నారాజుకడ కంపుచు నొక లేఖ నీక్రింది విధంబున రచించెను.

“సమదారాతి విజయ విజృంభమాణభుజపరాక్రమక్రములును, నేపాలభూపాలోత్తములును నగు, ధనంజయరాజచంద్రులకు——హరిదత్త చక్రవర్తి స్నేహపూర్వకముగ వ్రాయు లేఖార్థములు.——రాణ్మణీ!—— ఇంతవఱకు మాయాజ్ఞ నందక మాభూములకు మృగయార్థమరు దెంచిన వారు గానరారు. మీసాహసకార్యంబునకు మేమాశ్చర్యమునందినను, మీరు నూతనముగ రాజ్యమునకు వచ్చిన బాలురగుటచే మేము మీ స్నేహమునుగోరి, మీ కార్యము నోకతప్పుగా గణింపమైతిమి. ఇందువెంట మీకు గొన్ని యపురూపవస్తువులను బహుమానముగఁబంపితిమి. స్వీకరించి చిరకాలము మాకుహితులై యుందురుగాక! —— ఇట్లు, హరిదత్త చక్రవర్తి.

ధనంజయరా జీలేఖనుజూచి గుండెగొట్టుకొనియెను. అతఁడు నూతనముగ రాజ్యమునకు వచ్చినందుననే యేరాజు లెదెందు పరిపాలించుచుండిరో యెణుంగనివాఁడగుటను, హరిదత్త చక్రవర్తియను సంతకంబుండుట చేతను, తాను సామాన్య రాజమాత్రుఁడై తనకన్న నదికుఁడగు నొకచక్రవర్తి కలుక గల్పించితిని కాబోలునని తలంచి, యాబహుమానంబుల స్వీకరించి వానింగొనిచనిన, యాదవబాలుని గొప్పగా బహూకరించి, యనర్ఘ్యమణిభూషణ చీనిచీనాంబరాదులను, అనేక పారశీకాశ్వములను పదియేనుగులనుబంపి క్షమార్పణపత్రికను వ్రాసికొనియెను. మణికొన్ని నాళ్లకు కళింగ దేశపు రాజు వేటకురాగా నాతనికిని వెనుకటియట్లె లేఖనురచించి, నేపాళ రాజుచేఁ బంపఁబడిన వానినన్నిటి నాతనికంప నాతండును వెఱగుపడి యంతకు నాల్గు రెట్లుగా నాతఁడు