ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సుధాకరమహారాజు కథ

49


తారకమంత్రజపం బొనరించుచుండెను. రాత్రియంతయు నాబాలిక గుఱ్ఱుమనుధ్వనులు దిశలంజెలరేగ గాఢముగ నిద్రించుచుండ సుధాకరుం డామందయాన యండంబు ననిమిష లోచనములఁగాంచుచు విధివిపరీతంబునకు విచారించు చుండెను. అర్ధనిశీధం బతిక్రమించిన పిదప నాబాలిక నాశికారంధ్ర యుగళమునుండి రెండు క్రూరవిషసర్పంబులు బయలు వెడలి యగ్ని జ్వాలాయమానంబులగు విషజ్వలలంగ్రక్కుచు నాతనిపై పయింగవసీనంత, నాధీరుఁడు పరాక్రమించి యొక్క పెట్టున నావిషసర్పంబులం బరిమార్చి, యాబాలికను సంరక్షించిన మహానందంబునందియు, మరలనింకే యపాయంబు మూడునోయను సంశయంబున శేషయామినింగూడ నిద్రా వివర్జితుండై కాలము బుచ్చెను. ఇంతలోఁ బ్రభాతంబగుటయు నాబాలిక "దాహముదాహ” మని నిద్రలేచి పలువరింప నాతఁడు స్వహస్తంబులతోఁ బానీయంబునొసంగ నాకన్యారత్నము స్వీకరించియు దేదీప్యమానసౌందర్యముతో భాసిల్లు పరపురుషుని సన్నిధిని తానొంటరిగా నుంట 'నెఱింగి లజ్జాభరంబున మేలిముసుంగు సవరించుకొన దొడంగెను. ఇంతలో నారాజపుత్రుడు మృతినంది యుండునని తలంచుచు రాజదంపతులును రాజు సేవకులును పౌరజనంబులును నటకరుదెంచి, రాజపుత్రుఁడు సజీవియై యుండుటయు, రాజపుత్రిక నిరామయు యగుటయుం గాంచి విస్మితులగుచుండ సుధాకరుండు జఱిగిన సంగతిం దెలిపి, యా సర్పఖండములం జూపెను. అంత నాకాశీవురాధిపతి మహానందంబున వారిరువురకును బరిణయంబొనరించి, యర్ధరాజ్యంబు నొసంగి కతిపయ సేనా సమూహంబుల తోడను సమూల్యంబులగు నరణంబులతోడను కూతు నత్తింటి కంపెను.

నిజభార్యాసమేతుఁడై నిజరాజధానికరుగు సుధాకరుండు మార్గ మధ్యంబున శరభృంగాశ్రమంబున కరుదెంచి,యామునికి నమస్క రింప నాతఁ డాదంపతులను దీవించేను. అంత నాభూపతి నందనుం డట కొన్ని నాళ్లువసించి యొకనా డేకాంతంబున మునీంద్రునిగాంచి "ముని