ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిరకారిమహారాజు కథ

41


యాసతిని దేవరవారు ముద్దిడుకొను సమయంబునకు 'మేము వీరునకు తద్దృశ్యమును దూరమునుండి చూపుదుము. అంత నావెకలి వికలమతియై చిత్రయందు విరక్తి నందు"నని యుపదేశింప రాజు వల్లేయనియేతత్ప్ర యత్నముననుండె. ఈలోపల, కారాగృహబంధితుఁడై యున్న వీరునికడ కరు దెంచిన రాజసచివుఁడు "వీరా! నీవూరక చిత్ర కోఱకేలదుఃఖించి, విపత్తులకు లోనయ్యేదవు? స్త్రీలమనంబు లతిచంచలంబులనుట యెఱుంగవా? నీవు దరిద్రుఁడవనియు రాజు దేవేంద్రతుల్య భోగియనియు నెఱింగి చిత్ర యిదివఱకే యాతనిమఱిగియున్న "దని పలుక నాతఁడాపలుకుల నెంతమాత్రమును విశ్వసింపఁడయ్యె. అంతనామంత్రి వీరునకు నిదర్శన పూర్వకముగఁ జూపఁదలంచి యాతనింగొని రాజమందిరమున కరుగ పూర్వోదాహృత ప్రకారంబుగ 'రాజు, ధారుణిని ముద్దిడుకొనుట గాన్పించేను. అంత నాతఁడది నిజంబని, విశ్వసించి చిత్రయెకలగల విశ్వాసముం గోల్పడి విరక్తుఁడై పురంబును వదలి, యెందేనిం జనియెను. అట్లు బహుకాలంబునకు తనభర్త తనయందనురక్తి గల్గియుండుటకు ధారుణి యానందించుచుండ తన తంత్రము ముగియుటతోడనే క్రూరబాహు వాసాధ్వినావలంద్రోసి, తాను పన్నిన కపట నాటక కథ నెఱింగించి పరిహసించెను. అంత నా నెలంత యాశోపహతయై——తదీ యావమానంబును భరింపజాలక, స్వసుఖమార్ధ కంటక ప్రాయమగు చిత్రను దునిమి పగదీర్చుకొనఁ దలంచి కరవాలమును చేఁబూని, చిత్రా మందిరంబునకరుగ, నాటి రేయి విధివశంబున చిత్రకు మారుగ నాశయ్యపై నొక పరిచారిక శయనించి యుండెను. దాని నెఱుంగక రాణిక్రోధోద్రేకంబున నాపరిచారికను చిత్రగా భ్రమించి సంహరించెను.తత్కరవాలధ్వని నాలించి యనేక పరిచారికలు 'మేల్కని కేకలు వేయ నరపాలుఁ డటకరు దెంచి యట్టి దారుణ కార్యంబు నొనరించిన రాణి నొక యినుపబోనునందుంచి శార్దూల సంచార భీకరంబగు మహారణ్యంబున నొక వృక్ష శాఖకు వ్రేలాడదీసి వదలి రా, భటుల కాజ్ఞాపింప వారట్ల