ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

పండ్రెందురాజుల కథలు


స్వపాణిత లస్థంబగు పరశువుచే నాకిరాతునివధించి, బాలునిఁ గొనిపోయి వీరుడని పేరిడి, పోషించుచుండెను. తారపతి యొక్కయు, చిత్రరథుని యొక్కయు గృహంబు లతీసన్నిహితంబు లగుటం చేసి, దినదిన ప్రవర్ధమానులగుచున్న చిత్రావీరులకు, మైత్రి యతిదృఢతరంబయ్యె ఆమఱునాడు డోలికయందు బాలిక లేమిం జేసీ, మహాబాహువు మహత్తరంబగు నాందోళనంబునంది, పదచిహ్నంబులవలన, నాశిశు చౌర్య కార్యము, సుశీల వలన జఱిగెనని గ్రహించి సుశీలా శైలవతుల కొఱకై యనేక ప్రదేశంబుల నన్వేషింపఁ జేసెనుగాని, వారిపోబడి యెందునుఁ గానరాదయ్యె. అంతనారేడా శోపహతుండై తన పుత్రుఁడు కుశలియైయుండుటయే మహాభాగ్యమని తలంచి సంతృప్తుండై నిరాటంకముగ రాజ్యపాలనం బొనరించుచు పిదప పదునేను వర్షంబులకు శరీరము చాలించాను. అంతఁగ్రూర బాహువు రాజ్యారోహణంబొనరించి, యన్వర్ధ నామధేయుఁడై సదాక్రూరకార్యంబుల నొనరించుచు,దినంబులు గడుపసాగెను. ఆ క్రూర బాహువునకు సమస్తసద్గుణ సంపన్న యగుధారుణీ నామక భార్యారత్నంబమరి, యత్యంత భక్తితో భర్తృసేవల నొనరించుచున్నను, క్రూరాత్ముఁడగు క్రూరబాహువు పరదారా లోలుఁడై యాసాధ్వినాల్లకయుండెను. ఇది ఇట్లుండ నిచ్చట చిత్రయు వీరుఁడును యుక్తవయస్కులై యన్యోన్య ప్రేమపాస, బద్ధులైయుండిరి. చిత్ర యను దినంబును సుగంధ పుష్పావచయ మొనరించి, వానితో నందంబులగు మాలికలను, చెండ్లను నిర్మించి, పౌరులకు విక్రయించుచుండునది. ఒకానొక దివసంబున నాబాలిక పుష్పవిక్రయం బొనరింప రాజప్రాసాదంబున కరిగిన తరుణంబున నాబాల క్రూరబాహుని కంటఁబడియెను. అంతనా క్రూరుఁడా బాలను బలాత్కరింప నుద్యమించుటయు, నామె భీతకురంగమువలె వాని బారింబడక వీధులం బరువిడుటయు, లజ్జా గౌరవ విసర్జితుఁడగు క్రూరబాహు వామెను వెంబడించుటయు వీరుని కంటఁబడ, నాతఁడాకొన్న శార్దూలము