ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. జయ సేన మహారాజుకథ

తోల్లి మగధ దేశంబును, ధర్మాత్ముండగు, విజయసేనుండను మహారాజు జనరంజకంబుగఁ బెక్కు వర్షంబులు పరిపాలించెను. ఆవిజయ సేనునకు జయసేనుఁడను నొక్క కుమారుండును, అతని సోదరుండగు ప్రతాపసేనునకు, వినయ సేనుండను నొక్క కుమారుండునుఁ గలిగిరి. జయసేనుఁడు విజయసేనునకన్న నాల్గువత్సరంబులు పెద్దవాఁడగుటం జేసి, వినయసేనుం డగ్రజునియెడ వినయభ క్తివాత్సల్య తత్పరత మెలంగుచు నతనితో గూడి యఖిల విద్యారహస్యంబులను గురుముఖంబున నేర్చుచు నాతని నహోరాత్రంబు లన్న పానీయ సమయంబులందు సయిత మేమఱక సదాచాయవలె నంటియుండెను. ఇట్లుండఁ గొన్ని దివసంబులకు వార్థక్యంపు పెంపున, నవ్విజయసేనుం డాసన్న మరణుండై —— తన సహోదరుండగు ప్రతాపసేనునిఁ దనదరికిఁ జేరంజీరి, "సోదరా! నాకుఁ గాలము చెల్లిపోయినది. నేను శాశ్వతముగా నీ యిలాతలముంబాసి పోవుచున్నాను. ఇఁక మీదట, ప్రపంచజ్ఞాన రహితుండును, బాలుండును నగు, మన జయసేనునకు నాపిదప జనకుండవును రక్షకుండవును, నీవుదప్ప వేఱెవ్వఱును లేరు. మన జయసేనున కర్ష ప్రాయమువచ్చు నంతదనుక రాజ్యంబును నీవ సంరక్షించి పిదప కుమారునకుఁ బైత్రుకంబగు రాజ్యంబు నొసంగుమని జయసేనునిఁ బినతండ్రి కప్పగించి దేహము చాలించెను. సహోదర నిర్యాణానంతరంబునఁ బ్రతాపసేనుని హృదయము విషసంకల్ప సమాకీర్ణమై స్వపుత్రకుఁడగు వినయసేనుని రాజుగా నొనరించి, యేతంత్రంబుననైన జయసేనుని మడియింపఁదలఁచి యనేక, తంత్రోపాయంబుల నాతనిపైఁ " బ్రయోగించుచు వచ్చినను, తత్తంత్రం బులెల జయసేనునిఁ గంటికి ఱెప్పవలె నిరంతరముఁ గాచుకొనియుండు స్వపుత్రుండగు వినయసేనునివలనఁ బటాపంచలుగా నొనరింపఁ బడు చుండుటకుఁ బ్రతోపసేనుఁడు తన మనంబున నత్యంతవ్యాకులతంగాంచి