పుట:Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf/93

ఈ పుటను అచ్చుదిద్దలేదు

త్రావము జాహిదీలమని దంబము గొట్టెదవేల? యంతక
న్నా విపరీతకృత్యము లొనర్తువు నిత్యము; మాయవేషముల్‌
భావములోని కల్మషముఁ బాపునె? మానవసంఘ రక్తముం
ద్రావెదవీవు; ద్రాక్షఫలరక్తము మాకు రుచించు నెప్పుడున్‌.

చిరిగిన బొంతలం దొడిగి సిద్ధుల మంచవివేకలోకమున్‌
మొఱఁగి చరించు దుర్జనుల మోసముకంటెను మేలుగాదె యో
గురువర, కామినీ ప్రణయ గోష్ఠుల నాసవసేవ; త్రావినన్‌
నిరయము దప్పదన్న, మఱి నీ సురలోకము పాడుగాదొకో?

గురువ, సలాము, దైవమునకున్‌ మము వీడుము; మీకు మౌనమే
పరమహితంబు; అజ్ఞతను బల్కక యుండినఁ జాలు; మేము గ్రు
మ్మరునది సత్పథంబు గనుమా, నయనార్తుఁడవౌట దారి వ
క్కరముగఁదోఁచుఁ; గన్నులకు కాటుకవెట్టుము, చూపుమేలగున్‌.