పుట:Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf/37

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ii

ఖయ్యాము కవిత్వము


ఖయ్యాము ఇతర పారసీక కవులవలె గొప్పకావ్యమేదియు వ్రాయ లేదు. అరబ్బీ కవిత్వము కూడ కొంత వ్రాసియుండెను; కాని, ఏవో కొన్ని పద్యములు తప్ప మిగతవి కాలగర్భమున జీర్ణించిపోయెను. ఖయ్యాము శాస్త్రపరిశ్రమయందు విసుగెత్తిన మనస్సుకు వినోదము కల్పించుటుకొలుకు అప్పుడప్పుడు పద్యములు రచించి శిష్యులదగ్గరనో, మిత్రులకడనో లేక చండేశ గోష్ఠులందో చదువుచుండెను. ప్రత్యేకగుణ విశిష్టములును అంతస్సారయుతములునైన ఆ పద్యములు ప్రజల హృద తములందు నాటుకొనిపోయినవి. అయినను పారసీక పండితులు ఖయ్యామును గొప్ప కవిగా పరిగణింపలేదు. పారసీక వాజ్మయ చరి త్రమును వ్రాసిన బ్రౌనుగారును ఆ. పండితుల యభిప్రాయమునే గైకొని ఖయ్యామును మూడవతరగతి కవులలో చేర్చుట ఎంతయు విమర్శనీయము.


హిమాలయ పర్వతమునకున్న గంభీరసౌందర్యము, వైశాల్యము సానతీరిన వజ్రఖండమునకు లేకపోవచ్చును. అందుచేతనే అది గర్హ్య ముకాదు. కాళిదాసు మేఘసందేశము, వాల్మీకి రామాయణమంతటి బృహత్ ప్రబంధముకాదను కారణమువలననే ఆ కావ్యము నిరాద రణీయము కానేరదు. కళాసృష్టులను ఒకదానితో నొకటి సరిపోల్చి హెచ్చుతొచ్చుల నిర్ణయించుట తగదు. ఒక్కొక్క దానికిని ప్రత్యేకస్థా సము కలదు. “నిగ్గుగల్లు జాతినీల మొక్కటిచాలు తమకుబెళుకుఱాలు తట్టెడేల" అనునట్లు రాశికంటె గుణమే ప్రధానము. గుణము కలిగి