పుట:Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf/35

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30


కలపయు మట్టిఱాలనిడి కట్టిన దేవళమందు నీకు నే
ఫలము లభించు? ప్రేమరస భావయుతుండవయేని కొమినిన్
వలవుము; ప్రాణహీనమగు బండలు వేయిటికన్న శ్రేష్ఠమై
యలరుఁగదా మనుష్యహృదయంబు ప్రతి ప్రణయానురక్తులన్.


స్వప్రయత్నము విఫలమైనపుడు, కష్టములు తలతాకినపుడు ధీమంతులు సైతము ఒక్కొక్కప్పుడు ఆత్మ విశ్వాసము కోలుపోయి నిరుత్సాహవంతులగుచుందురు. ఖయ్యాము హృదయముకూడ కాల సర్పదంష్ట్రాదష్టమైనది. జీవితములోని లోతుపాతులు కొనవచ్చినవి. కవితా విహంగము భావసౌకల్పిత ప్రపంచమున నక్షత్రమండలమున ఎగురుట మాని భూమిపైనున్న గూటియందు కూలఁబడెను. “కాలశరాసనోత్పతిత కాండముతీక్షాణ" మని తెలిసినది. ఈ ప్రపం చము నందనవనమయ్యు ధనములేనివారికి బంధనమగునను సత్యము గోచరించినది. మరణ భయముకంటే జీవసంభరణభయమె మిక్కు టమని తోచినది. "కోరికలన్నియుం గుడుపుగూరవు సౌఖ్యము దుఃఖ మెప్పుడంగూరురసంబు చేఁదటులు కూడియెయుండు” నను జీవితరహస్యము బోధపడినది.విధి యనివార్యమను భావమువలన తృప్తియలవడినది. ఖయ్యాము సహజముగ ధీమంతుఁడు కావున నిరు త్సాహపడక ఇట్లు చెప్పెను:

విధి నిబద్ధము వచ్చు వెడలిపోవు
నఖిల సుఖదుఃఖములు నీ కయాచితముగ;
జడియఁబోకు రుస్తుముజాలు శత్రుఁడైన;
తాయి సఖుఁడైన విందులఁ దలఁపఁబోకు.


ఈనాఁటి ఖయ్యాము జీవితము ఈ క్రింది పద్యమున ప్రతి ఫలించుచున్నది,

జ్ఞానపటాలయమ్ము నొడికమ్ముగఁగుట్టు ఖయామున్నేడు దుః
ఖానల దగ్ధుడయ్యె; యముఁడ , బైనుకత్తెర జీవితంపు బి