పుట:Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf/31

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26



చుండెను. పూర్వ మీ అరబ్బీ గ్రంథము ఫ్రెంచి భాషలోని కను వదింపఁబడినది. ఇదికాక, ధాతురసాయన శాస్త్రము, యూక్లిడ్ జామెట్రీకి వ్యాఖ్యానము, ఒక తత్త్వశాస్త్రము, రుబాయతు, అన్నియు కలసి తొమ్మిది గ్రంథములను అతఁడు రచించెను. అక్షరగణితము, రసాయనశాస్త్రము, జ్యామెట్రీ వ్యాఖ్యానముల మాతృకలు ప్యారిన్, లండన్ , ఇండియా ఆఫీసు లయిబ్రరీలయందు భద్రము చేయబడి యున్నవి. తక్కినవి (రుబాయతు తప్ప) నామమాత్రావశిష్టములు. గ్రహగతులననుసరించి వాయు వర్షముల ముందుగ తెలిసికొను శక్తి కూడ ఖయ్యామున కుండినదని నిజామి ఉరూజి సమర్ఖండి ఇట్లు వ్రాసియున్నాఁడు: “సదరుద్దీన్ మహమ్మద్ బిన్ ఉల్ మజఫర్ పాదుషా, తాను వేటాడఁబోవలయుననియు వర్షముకాని మంచుకాని కురువని యొకదినము నిర్ణయించి తెలుపవలయుననియు మెర్వు పట్టణమునుండి ఖయ్యామునకు చెప్పివంపెను. అంతట ఆయన రెండుదివములు గ్రహగతులు లెక్కించి ముహూర్తము నిర్ణయించి స్వయముగా పాదుషా యొద్దకుపోయి ఫలానిదినము బాగుగయున్న దని తెలిపెను. పొదుషా వేఁటకు ప్రయాణమగుచుండగనే నలుదెసల మబ్బులు క్రమ్ముకొని మంచు కురవనారంభించెను. లోకులు హకీం సాషాబును నిందించిరి. పాదుషాయును వెనుకకు మరలం దలంచుకొ నెను. అంతట ఖయ్యాము “నిర్భయముగ ప్రయాణముకండు. మబ్బు విచ్చిపోవును; అయిదు దీనముల వఱకు నేలచెమ్మ యైనకాదు" అని చెప్పెను. అట్లే పొదుషా ప్రయాణము సాగించెను. కొన్ని నిము షములకు గాలివీచి మబ్బు చెల్లాచెదరైపోయెను. మంచుపడుటయు నిలిచెను. అయిదు దినముల వఱుకు చినుకు చిటుక్కుమని పడలేదు.” ఖయ్యాము జ్ఞప్తికూడ చాల అద్భుతమైనదని చెప్పుకొందురు. అతఁడు ఇస్పపోన్ మఖాము నందు విడిసియుండగా ఒక పుస్తక మును ఏడుమాఱులు చదివెను. నిషాపూరునకు వచ్చిన వెనుక తాను చదివిన పుస్తకమును జ్ఞప్తి పెట్టుకొని తిరుగ ప్రాసెను. తరువాత