పుట:Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf/29

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

ఇండియగోచరుఁడు కాండనియు, ఇట్టివాఁడని నిరూపించుటకు వీలు కానివాఁడనియు, సృష్టికి హేతుభూతుడనియు, అతఁడు తన తత్త్వ

  • శాస్త్రమున వ్రాసియున్నాడు. ఆత్మ మబ్బులో మెఱుపుతీగవలె

ప్రజ్వలించి అంతర్హితమౌనని ఆల్మోనతరణమను కావ్యమునందు వ్రాసియున్నాఁడు.


ఒకరాత్రి భోగానుభవమునందు, మఱియొక రాత్రి విజ్ఞానార్జనము నందు ఇబిస్సీనా కాలము గడుపుచుండెనని యొక లోకవాదము కలదు. రాజ్యకార్య లంపటత్వమునతప్ప ఇబిన్ సీనాకును ఉమ్రఖయ్యా మునకును భావములందు, మనఃప్రవృత్తులందు ఏమియు భేదములు గోచరింపవు, ఖయ్యాము యౌవనకాలమునాఁటికి ఇజిన్ సీనా తత్త్వ ములు, బోధలు, భావములు కజకుమాయుకుండెను.ఖయ్యాము అతనిని ఆదర్శవ్యక్తిగా గ్రహించియుండవచ్చును.


ఇంక అప్పటి రాజకీయ పరిస్థితుల సరయుదము; సుల్తాను మహా మ్ముదు గజ్నవి క్రీ. వె. 1030 వ సంవత్సరమున కీర్తి శేషుఁడాయెను. ఆతని పుత్రుండు మాసూదు సింహాసనమధిష్టించెను. నాలుగు సంవత్సరములు గడచిన వేనుక 'నెల్జూరు వంశీయులగు త్రోగుల్, బేగ్, చకిర్ బేగ్ అను యిరువురు తురుష్క నాయకులు అతని నోడించిరి. అది మొదలు ఇరువది సంవత్సరములవలకు సెల్జూకుల విజయధ్వజము అప్రతిహతముగ పౌరసీకమున సమరయాత్ర సలుపు చుండెను. దేశమున శాంతి యంతరించెను. మెర్వు, నిషాపూరు, పౌరాత్, సేస్తాన్ , బాగదాదు మున్నగు ముఖ్యపట్టణములు ఆ బురువురు తురుష్క నాయకుల వశమైనవి. వీరి మరణానంతరము అల్ప్ అర్సలాన్ పొరసీక సామ్రాజ్య సింహాసన మధిష్ఠ్మించెను. తొమ్మిది సంవత్సరములు గడచిన వెనుక అత్యడు విప్లవకారులచే హత్యకోవింపఁబడెను. అటు తర్వాత మలిక్ షా రాజ్యభారము వహిం చెను. అల్ప్ అర్సలాన్ కు మంత్రిగ నుండిన నిజాముల్ ముల్కు మలిక్ షాకును మంత్రియాయెను.