పుట:Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf/116

ఈ పుటను అచ్చుదిద్దలేదు

23. బుల్బులి - వసంత ఋతువున పాడుచుండు ఒక చిన్న పిట్ట. ఆకారమునందు కాకపోయినను కూతయందు, కవులచే వర్ణింపఁబడుటయందు అది మన కోయిలకు సరిపోవును.

నీరక్తాస్యముల్- నెత్తురులేక పాలిపోయిన మొగములు.

26. నమలు - సంవత్సరములు

27. సాఖి - పాత్రవాహిక

28. ద్రాక్షామణి ముద్దుకూఁతురు - ద్రాక్షాసవము

41. మహమ్మూదు - మహమ్మదుగజ్నవి. ఈతని రాజ్యకాలమున పారసీకదేశము సకల భోగభాగ్యముల నోలలాడుచుండినది. ఇతఁడు వాఙ్మయ పోషకుఁడు. సోమనాథ దేవాలయమును ఈతఁడే విధ్వంస మొనర్చెను.

దావీదు - ఈతఁడు యాకూబు పుత్రుఁడు. సుప్రసిద్ధుఁడైన గాయకుఁడు; బైబిలులోని (Psalms) కీర్తనలు రచించెను.

44. కౌసరు - స్వర్గమును ప్రవహించు తేనె వాఁక.

45. జంషీదు పాత్రము - ఈ పాత్రములో చూచిన భూత భవిష్య ద్వర్తమాన కాలములు దెలియవచ్చును. ఇది జంషీడను పూర్వపారసీక ప్రభువు వద్ద మండెనని ప్రతీతి.

46. నెలవంకయుచ్చులు - సాఖినొసలు నెలవంక. ముంగురులు అది పన్నిన ఉచ్చులు. ఆ ఉచ్చులలో (ఖయ్యాము) హృదయు పట్టుబడియున్నది. అక్కరలేనిదే ఎవడు గాని తమాషాకు ఉచ్చులలో చేయిపెట్టడు. నా హృదయము వానిలో చిక్కుపడి ఉన్నది. గావున దానిని ఓదార్చుటకు నేను చేయివేసితిని. నీవు బెదరించుట యెందుకు అని చమత్కారము.

53. చిత్రదీపము - మాజిక్ ల్యాంట్రన్.