పుట:Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf/115

ఈ పుటను అచ్చుదిద్దలేదు

వివరణము

3. దౌలతు - ప్రాభవము.

4. నరకము - పానపాత్ర

6. కైఖుస్రువు - కయానీ వంశీయుఁడైన ఒక సుప్రసిద్ధ పాదుషా.

8. మూసాస్వేతహస్త ప్రభల్ - మూసాప్రవక్త (Moses) చేతులకు తెల్లకుష్టువు పొడలుండెననియు, అవి చాల రమ్యముగ నుండినవనియు చెప్పుదురు. కొమ్మలలో మూసా చేతులవలె పూలు పూచెనని భావము.

మునాది - రేపుమాపులు మసీదునందు గొంతెత్తి దైవప్రార్థన చేయునతఁడు.

13. రాగవతి - ఇదియొక పూలమొక్క; దీనిని ఇంగ్లీషులో Tulip అని అందురు.

14. బహురాముగోరి - పూర్వ పారసీకరాజు; గోర్ అనఁగా అడవి గాడిద, అతఁడు అడవి గాడిదలను వేఁటాడుచుండినందువలన ఆ పేరు వచ్చినది. గోర్ ను పట్టినయతఁడు గోర్ లో పట్టుపడెను. అని చమత్కారము. ఇచ్చట గోర్ అను పదము శ్లేషింపఁబడినది గోర్ అనఁగా సమాధియనియు అర్థము గలదు.

15. వజీరు - మంత్రి.

19. నీలకాంత - ఇది యొక పూలమొక్క. పారసీలో `బనఫ్'షా' అనియు ఇంగ్లీషులో Vioulet అనియు పేర్కొందురు.