ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదిలింగ ఎల్లిరావే ఓయి సెల్లూలా
పళ్ళు పువ్వూలున్ను ఓయి సెల్లూలా
పట్టూ కెళ్ళ వోలే ఓయి సెల్లూలా
ఓయి మాబావ వచ్చేడు ఓయి సెల్లూలా
నే నెల్లి ఒత్తాను ఓయి సెల్లూలా

ఈ పాట వింటే, కుమార్తె తరలి పోయిన తర్వాత

" ఏరెంత వెళుపమ్మ యినుక సన్నమ్ము
ఏరుదాటి వెళ్లింది ఎవరాడ పడుచు
మూట నున్నది పసుపు పొట్లాన కుంకం
వడి నిండ పోకల్లు పండుటాకుల్లు
భమిడి శ్రీ పిల్లమ్మ సారె వెళ్లింది ”

అన్న పాట గుర్తుకు వస్తున్నది,