ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యేనాది పిల్ల

కవులు జీవిత సందర్భాను సారముగా చాటు పద్యములను చెప్పినట్లుగా దేశ జనులు బ్రతుకు బాటలలోని అనుభవములనే పాటలుగా నల్లు కొందురు. కవుల అనుభవాల కంటె ప్రజల అనుభవాలు నిసర్గములున్నూ బహుముఖార్తములున్నూ అవుతవి. అందువల్ల జానపద గేయముల వైశాల్యము సముద్ర ప్రాయమై ప్రతిముఖ విచ్చిన్న మవుతుంది. ఈ దళము నందు ఉదహిరించిన గేయములు దేశి జనుల బ్రతుకు బాటలను లీలగా మాత్రమే సూచించగలవు.

——జానపద నియమములు జీవిత ప్రతిబింబాలు గాని ఆ ఆలోచనలుగాని కావని నిరూపిస్తుంది. ఈ గేయము చూడండి. ఈ సుకుమారి నటి మాటలు. ఈ స్రుష్టి జానపదుల సుందర సృష్టి.

పవూరు యేనాది పిల్లానీది
మాటలకు మోటుపల్లి మామానాది
సిగ్గులేని చీనిపల్లె మామానాది
మానం లేని మాదిగపల్లే మామానాది
కట్టెల కన్న పోరాద పిల్లానీవు
కటైలంటే కాళ్ళు నొస్తే మామానాకు
నీళ్ళ కన్న పోరాద పిల్లానీవు
నీళ్ళంటె నీరాసం మామానాకు
వడ్లన్నా దంచరాద పిల్లానీవు
వడ్లంటె చేతులు నొస్తే మామానాకు
సంత కన్న పోరాద పిల్లానీవు
సంతంటే సంతోషం మామానాకు
సంతోషం సంతోషం సక్కి లిక్కిలిగా
బుద్ధి మంత కూతురే బుడిగిలిక్కిలిగా

కడసారి పంక్తులు ఒక్క పొంగుతో పైకి వస్తున్నది.

82