ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గోపి రెడ్డి


——గుఱ్ఱాల గోపిరెడ్డి చిన్నపరెడ్డి వలెనే చండ శాసనుడై యుంటాడు. బాధితులు నలుగురు హఠాత్తుగా చేల నడుమన పట్టి నరికినారట. పోతేపోయెను. చావని వారోకరు గలరా ? గోపిరెడ్డి ఎటువంటి వాడు ? శేరు శేరు వెండి మురుగులతో, దువ్వి నిక్కడన మీసముతో కట్టప మీద పోతూవుంటే 'కదిరి తేరూ సాగినట్లే !

       ఓ గుఱ్ఱాల గోపిరెడ్డి
       దాచేపల్లికి దానమైలి వా
శేరు శేరు ఎండి మురుగుల్ చేతులాకు బెట్టుకోని
కట్టవ మీద వస్తావుంటే కలక టేరను కొంటిర కోడుకా
       వయ్యారి కొడకా బంగారు కొడకా
       దాచేపల్లికి దానమైతి వా
ఆపక్క ఒక సేను ఈపక్క ఒకసేను
నడుమ సాపసేను సందుననిన్ను నలుగురు బట్టి
       నరికిరి కొడక వయ్యారి కొడక చిన్నారి కొడకా
       దాచేపల్లికి 'దానమైతివా,

గోపిరెడ్డి ద్యాష్ట మేదో తెలియరాదు.